World's Biggest School : ప్ర‌పంచంలోనే అతిపెద్ద పాఠ‌శాల ఇదే.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

ప్ర‌పంచంలోనే బెస్ట్ క్వాలిటీతో, ఉత్త‌మ విద్య‌, ఉన్నత సౌక‌ర్యాల‌తో ఉండే విద్యాసంస్థ‌లు విదేశాల్లో ఉంటాయని బాగా న‌మ్ముతారు జ‌నాలు. విదేశాల్లోని విద్యాసంస్థ‌ల్లో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేష‌న్ ఉంటుంద‌ని ఆశిస్తుంటారు. అందుకే ఎక్కువ శాతం భార‌తీ విద్యార్థులు అక్క‌డే త‌మ ఉన్న‌త విద్య‌ను పొందాల‌నుకుంటారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: విదేశాల్లో ఎన్నో ప్ర‌సిద్ధి చెందిన పాఠ‌శాల‌లు, ఎంతో పేరొందిన యూనివ‌ర్సిటీలు, ఉత్త‌మ ఉన్న‌త విద్య‌ను అందించే సౌక్య‌ర్యాలు, అవ‌కాశాలు ఉంటాయని అక్క‌డే స్థిర‌ప‌డేలా ల‌క్ష్యాలు కూడా పెట్టుకుంటారు చాలామంది విద్యార్థులు.

Job Opportunities: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వేతనం

అయితే, ఒక‌వేళ‌, ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద‌, పేరొందిన‌, అత్యున్న‌త సౌకర్యాలు, బెస్ట్ ఎడ్యుకేష‌న్ పొందగ‌లిగే పాఠ‌శాల ఎక్క‌డ ఉంది అంటే.. ఏం చెబుతారు..? ఎక్క‌డ ఉంటుంది.. ఏ అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, లేదా ఇంకేదైనా విదేశంలోనో ఉంటుంది అని చెబుతారు లేదా అనుకుంటారు. కాని, కాదండి..

ప్రపంచంలోనే అతి పెద్ద పాఠ‌శాల ఈ దేశంలోనే..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అతి పెద్ద‌, పేరొంది బెస్ట్ స్కూల్ అంటే ఏ విదేశాల్లోనో లేదు అది మ‌న భార‌త్ దేశంలోనే ఉందండి.. అంటే న‌మ్ముతారా..?? కానీ, ఇదే నిజం.. వ‌రల్డ్ లార్జెస్ట్ స్కూల్ భార‌త్‌లోని ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో కేంద్రంగా నడుస్తున్న సిటీ మాంటిస్సోరి స్కూల్ (సీఎమ్ఎస్‌) ఉంది. మ‌రో విశేషం ఏంటంటే.. ఈ స్కూల్‌కి గిన్నీస్ వ‌ర్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా దీని పేరుంది.

Rajender Meghwar: పాకిస్థాన్‌లో తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్

5 మంది నుంచి 60 వేల విద్యార్థుల‌తో..

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఉన్న ఈ పాఠ‌శాల‌ను 1959లో డాక్టర్ జగదీష్ గాంధీ, డాక్టర్ భారతీ గాంధీ కలిసి ప్రారంభించారు. ఈ పాఠ‌శాల ప్రారంభంలో కేవ‌లం 5 మంది విద్యార్థులు మాత్ర‌మే ఉండేవారు. వారికే, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేవారు. కాని, ఈ పాఠ‌శాల‌లో విద్య‌విధానం, సౌక‌ర్యాలు, ఇలా ఒక్కొ మెట్టు ఎక్కుతూ నేడు ఈ స్కూల్‌లో 60 వేల‌కు పైగా విద్యార్థులు చ‌దువుతున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అంతేకాదు, టీచర్లు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది కలిసి మొత్తంగా 4,500 మందికి పైగా ఇక్కడ పనిచేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఈ స్కూల్‌కి 21 క్యాంపస్‌లు ఉన్నాయి. ఇలా, ఎంతో చిన్న  విద్యాసంస్థ నుంచి ఎదిగి నేడు ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద విద్యాసంస్థ‌గా పేరు తెచ్చుకున్న సంస్థ‌గా వ‌రల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరు కూడా తెల‌చ్చుకుంది.

PGCIL Recruitment: పీజీసీఐఎల్, గురుగ్రామ్‌లో 71 ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఈ స్కూల్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

1. సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో 1000కి పైగా క్లాస్ రూమ్స్, 3,700కు పైగా కంప్యూటర్లు ఉన్నాయి. 
2. హయ్యర్ సెకండరీ స్కూల్‌గా సేవలు అందిస్తున్న సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో మొత్తంగా 4 సెక్షన్లు ఉంటాయి. అవే.. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, జూనియర్, సీనియర్ సెక్షన్లలో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. 
3. కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్‌సీఈ) ఆమోదం పొందిన ఈ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో పాటు మిగతా యాక్టివిటీలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటారు. 
4. ముఖ్యంగా, కళలు, సంగీతం, నృత్యం, డ్రామా, స్పోర్ట్స్, డిబేట్స్, MUN వంటి కో కరిక్యులర్ యాక్టివిటీల్లోనూ ఈ స్కూల్ బెస్ట్ సర్వీస్ అందిస్తోంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

చ‌దువుతోపాటు ఇత‌ర విష‌యాలు కూడా..

అకడమిక్ చదువులే కాకుండా విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, సామాజిక నైపుణ్యాలు, విశాల దృక్పథాన్ని అలవరచడం, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన వంటి విష‌యాల్లో మరింత  కల్పించడంలో ఈ స్కూల్ ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పొచ్చు.
విద్యార్థులను అర్థం చేసుకోవడానికి, వారి ఆలోచనలకు సరైన మార్గనిర్దేశం చేయడానికి ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల‌కు ఎంతో సహాయపడతారు.
CUET Exam Changes In 2025: యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)లో మార్పులు
ఈ స్కూల్‌లో చేరిన విద్యార్థిని పరిపూర్ణ వ్యక్తిలా తీర్చిదిద్దుతారు. అందుకే, ఈ స్కూల్‌లో తమ పిల్లల్ని చేర్పించడానికి చాలా మంది పేరెంట్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
చ‌దువుతోపాటు ఇత‌ర విష‌యాల్లో కూడా దృష్టి సారించ‌డంతో ఈ పాఠ‌శాల పేరు మ‌రింత మారుమోగింది.

ప్ర‌ముఖులు కూడా..

ఎంతో మంది ప్రముఖులు ఈ స్కూల్‌లో చదివారు. బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ, మోడల్ జితేష్ సింగ్ వంటి ప్రముఖులు ఈ స్కూల్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు.

అవార్డులు.. రివార్డులు..

1. సిటీ మాంటిస్సోరి స్కూల్‌కి 2002లో యునెస్కో శాంతి విద్యా బహుమతి లభించింది. 
2. 2005లో వరల్డ్ లార్జెస్ట్ స్కూల్‌గా రికార్డ్ సాధించింది.

Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్‌ రెడ్డి

#Tags