KTR: ఖర్చులు మేమే భ‌రిస్తాం.. మా స్టూడెంట్స్‌ని త్వరగా తీసుకురండి..

ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
KTR

వారి తరలింపుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ రాష్ట్ర ప్రజల విషయంలో ఇప్పటికే కేంద్రానికి పలు రాష్ట్రాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది.

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం..
తెలంగాణ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో సగానికి పైగా విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. వీరి కోసం హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లిలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. తమను రక్షించాలని.. త్వరగా ఇండియాకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అనేక కాల్స్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లకు వస్తున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

APNRTS హెల్ప్‌లైన్‌ నెంబర్‌: 0863-2340678
ఏపీ హెల్ప్‌లైన్‌ వాట్సాప్‌ నెంబర్‌ +918500027678

ఢిల్లీలో సంప్రదించాల్సిన అధికారులు: 
శివ శంకర్‌- 9871999055
రామారావు-9871990081
సాయిబాబు- 9871999430


న్యూఢిల్లీ, తెలంగాణ భవన్‌కు సంబంధించిన హెల్ప్‌ లైన్‌ నెంబర్లు
విక్రమ్‌ సింగ్‌ మాన్‌, ఐపీఎస్‌ : 7042566955
చక్రవర్తి, పీఆర్వో: 9949351270
నితిన్‌, ఓఎస్‌డీ: 9654663661

తెలంగాణ సెక్రటేరియట్‌, హైదరాబాద్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్లు
చిట్టిబాబు, ఏఎస్‌వో: 040-23220603
                : 9440854433

ఈమెయిల్‌ ఐడీ: so_nri@telangana.gov.in

#Tags