School Holidays List December 2023 : స్కూల్స్‌కు 9 రోజులు సెల‌వులు.. బ్యాంకులకు 14 రోజులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు దాదాపు 9 రోజులు నుంచి 10 రోజులు పాటు రానున్నాయి. డిసెంబర్‌ నెలలో ఐదు ఆదివారాలు వ‌చ్చాయి. అలాగే రెండో శ‌నివారం, నాలుగో శ‌నివారం కూడా కొన్ని స్కూల్స్‌కు సెల‌వులు ఉన్న విష‌యం తెల్సిందే.

క‌నుక ఈ నెల‌లో శ‌ని, ఆదివారం క‌లుపుకుంటే మొత్తం 7 రోజులు స్కూల్స్ సెల‌వులు ఉన్నాయి. డిసెంబ‌ర్ నెల‌లో మ‌రో పెద్ద‌ పండ‌గ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండ‌గ‌కు సెలవులు డిసెంబర్‌ 23 నుంచి 30వ తేదీ(క్రిస్మస్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి) వరకు ఉంటాయి. మిగిలిన‌ స్కూల్స్‌కు క్రిస్మస్, బాక్సింగ్ డే  సందర్భంగా రెండు రోజులు పాటు (డిసెంబ‌ర్ 25, 26వ తేదీన‌) సెల‌వులు ఇస్తారు. దీంతో స్కూల్స్‌కు డిసెంబ‌ర్ 24వ తేదీ(ఆదివారం), 25వ తేదీ(క్రిస్మస్), 26వ తేదీల్లో(బాక్సింగ్ డే) సంద‌ర్భంగా మూడు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

హైదరాబాద్‌లో మాత్రం..
హైదరాబాద్‌లోని మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఇక తెలంగాణలో నవంబర్ 29, 30 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతారు. అందువల్లనే నవంబర్ 29, 30 తేదీల్లో సెలవులు ఇస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అలాగే డిసెంబ‌ర్ 1వ తేదీన కూడా సెల‌వులు ఇవ్వాలంటే... కొన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

డిసెంబరు నెలలో బ్యాంకులకు భారీగా సెల‌వులు..
డిసెంబరు నెలలో బ్యాంక్‌ల‌కు భారీగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా 2023 డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్​ హాలీడేస్ జాబితాను ప్రకటించింది. దీంతో బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందులు తప్పవు కాబట్టి ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను షెడ్యూల్ చేసుకోవడం మంచిదంటున్నారు. కానీ ఈ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. కాగా ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. 

డిసెంబర్​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా..:

☛ డిసెంబర్​ 1 (శుక్రవారం) : అరుణాచల్​ ప్రదేశ్​లోని బ్యాంకులకు సెలవు.
☛ డిసెంబర్​ 2 (శనివారం) : భారతదేశంలోని బ్యాంకులన్నింటికీ సెలవు.
☛ డిసెంబర్​ 3 (ఆదివారం)
☛ డిసెంబర్​ 5 (మంగళవారం) : షేక్​ ముహమ్మద్​ అబ్దుల్లా జయంతి సందర్భంగా జమ్ము, కశ్మీర్​లోని బ్యాంకులకు హాలీడే ఇవ్వడం జరుగుతుంది.
☛ డిసెంబర్​ 10 (ఆదివారం)
☛ డిసెంబర్​ 18 (సోమవారం) : గురు ఘాసీదాస్ జయంతి సందర్భంగా చండీగఢ్​​లోని బ్యాంక్‌లకు హాలీడే.
☛ డిసెంబర్ 19 (మంగళవారం) : లిబరేషన్ డే సందర్భంగా గోవాలోని బ్యాంకులకు సెలవు.
☛ డిసెంబర్​ 23 ( నాలుగో శనివారం)
☛ డిసెంబర్ 24 (ఆదివారం)
☛ డిసెంబర్​ 25 (సోమవారం) : క్రిస్టమస్. మిజోరం, మేఘాలయల్లోని బ్యాంకులకు సెలవు.
☛ డిసెంబర్ 26 (మంగళవారం) : సర్దార్​ ఉద్ధమ్ సింగ్ జయంతి. హరియాణాలోని బ్యాంకులకు సెలవు.
☛ డిసెంబర్​ 30 (శనివారం) : తము లోసర్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
☛ డిసెంబర్ 31 (ఆదివారం)

వ‌చ్చే ఏడాది 2024 సంవ‌త్స‌రానికి గాను..

వ‌చ్చే ఏడాది 2024 సంవ‌త్స‌రానికి గాను ప్రభుత్వ సాధారణ సెలవుల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేరకు ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ‌చ్చే ఏడాది 2024లో స్కూల్స్‌, కాలేజీల‌కు ఎక్కువ సెల‌వులు రానున్నాయి.

ఈ సారి సంక్రాంతి, ద‌స‌రా, క్రిస్టమస్ పండ‌గ‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు ఎక్కువ రోజులు రానున్నాయి. అయితే 2024 ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి, అక్టోబ‌ర్ నెల‌లో ఎక్కువ రోజులు సెల‌వులు వ‌చ్చాయి. అలాగే భారీ వాన‌లు, బంద్‌ల వ‌ల్ల స్కూల్స్‌, కాలేజీల‌కు అనుకోని సెల‌వులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

వ‌చ్చే ఏడాది 2024 ప్రభుత్వం ప్ర‌క‌టించిన సెల‌వులు ఇవే..

☛ జనవరి–2024లో సెలవులు ఇవే..
➤ 01-01-2024 సోమవారం – న్యూ ఇయర్ డే
➤ 14-01-2024 ఆదివారం – భోగి
➤ 15-01-2024 సోమవారం – సంక్రాంతి/పొంగల్
➤ 16-01-2024 మంగళవారం – కనుమ
➤ 26-01-2024 శుక్రవారం – రిపబ్లిక్ డే

☛ మార్చి–2024లో సెలవులు ఇవే..
➤ 08-03-2024 శుక్రవారం – మహా శివరాత్రి
➤ 29-03-2024 శుక్రవారం – గుడ్ ఫ్రైడే

☛ ఏప్రిల్‌–2024లో సెలవులు ఇవే..
➤ 05-04-2024 శుక్రవారం – బాబుజగ్జీవన్మ్ జయంతి
➤ 09-04-2024 మంగళవారం – ఉగాది
➤ 10-04-2024 బుధవారం – రంజాన్
➤ 14-04-2024 ఆదివారం – డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి
➤ 17-04-2024 బుధవారం – శ్రీరామనవమి

☛ జూన్–2024లో సెలవులు ఇవే..
➤ 17-06-2024 సోమవారం- బక్రీద్

☛ జూలై–2024లో సెలవులు ఇవే..
➤ 17-07-2024 బుధవారం – మొహర్రం

☛ ఆగస్టు–2024లో సెలవులు ఇవే..
➤ 15-08-2024 గురువారం – స్వాతంత్య్ర దినోత్సవం 26-08-2024 సోమవారం – శ్రీ కృష్ణ అష్టమి

☛ సెప్టెంబర్–2024లో సెలవులు ఇవే..
➤ 07-09-2024 శనివారం –వినాయకచవితి
➤ 16-09-2024 సోమవారం –ఈద్ మిలాదున్ నబీ

☛ అక్టోబర్–2024లో సెలవులు ఇవే..
➤ 02-10-2024 బుధవారం –మహాత్మాగాంధీ జయంతి
➤ 11-10-2024 శుక్రవారం –దుర్గాష్టమి
➤ 12-10-2024 శనివారం –మహర్నవమి
➤ 13-10-2024 ఆదివారం –విజయదశమి/దసరా
➤ 30-10-2024 బుధవారం నరకచతుర్ధశి
➤ 31-10-2024 – గురువారం దీపావళి

☛ డిసెంబర్‌-2024లో సెలవులు ఇవే..
➤ 25-12-2024 బుధవారం–క్రిస్టమస్

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

2024 సెల‌వుల స‌మ‌గ్ర వివ‌రాలు ఇవే..

సెల‌వు తేదీ

 రోజు

సెలవు

01–01–2024

సోమవారం

న్యూ ఇయర్‌ డే

14–01–2024

ఆదివారం

బోగి

15–01–2024

సోమవారం

సంక్రాంతి/పొంగల్‌

16–01–2024

మంగళవారం

కనుమ

26–01–2024

శుక్రవారం

రిపబ్లిక్‌ డే

08–03–2024

శుక్రవారం

మహాశివరాత్రి

29–03–2024

శుక్రవారం

గుడ్‌ ఫ్రైడే

05–04–2024

శుక్రవారం

బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతి

09–04–2024

మంగళవారం

ఉగాది

10–04–2024

బుధవారం

రంజాన్‌

14–04–2024

ఆదివారం

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

17–04–2024

బుధవారం

శ్రీరామనవమి

17–06–2024

సోమవారం

బక్రీద్‌

17–07–2024

బుధవారం

మొహర్రం

15–08–2024

గురువారం

స్వాతంత్య్ర దినోత్సవం

26–08–2024

సోమవారం

శ్రీ కృష్ణ అష్టమి

07–09–2024

శనివారం

వినాయకచవితి

16–09–2024

సోమవారం

ఈద్‌ మిలాదున్‌నబీ

02–10–2024

బుధవారం

మహాత్మాగాంధీ జయంతి

11–10–2024

శుక్రవారం

దుర్గాష్టమి

12–10–2024

శనివారం

మహర్‌నవమి

13–10–2024

ఆదివారం

విజయదశమి/దసరా

30–10–2024

బుధవారం

నరకచతుర్ధశి

31–10–2024

గురువారం

దీపావళి

25–12–2024

బుధవారం

క్రిస్టమస్‌ 

#Tags