Andhrapradesh News: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు.... మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో టీచర్‌ పోస్టులు భర్తీ

Andhrapradesh News: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు.... మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో టీచర్‌ పోస్టులు భర్తీ

బాపట్ల: ప్రభుత్వం నిర్వహి­స్తున్న మెగా పేరెంట్, స్టూడెంట్స్, టీచర్స్‌ ఈవెంట్‌ గిన్నిస్‌ బుక్‌లో శాశ్వతంగా లిఖించదగ్గ కార్యక్రమ­మని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు  తీసుకొస్తున్నా­మన్నా­రు. శనివా­రం బాపట్ల మున్సి­పల్‌ పాఠశా­లలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యా­యుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లా­డారు. హైదరాబాద్‌ దేశంలో నంబర్‌ వన్‌ అయిందంటే తాను అమలు చేసిన విజనేన­న్నారు. ఇప్పుడు 2047 విజన్‌ తెచ్చాన­న్నారు. 

ప్రైవేట్‌ పాఠశాలలకంటే బెటర్‌గా ప్రభుత్వ పాఠశా­లల పిల్లలను చదివిస్తామన్నారు. ఏడాదికి మూడు సార్లు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏటా డిసెంబర్‌ 7న మెగా ఈవెంట్‌ నిర్వ­హిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు విద్యతో­పాటు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోని అంశాలపై శిక్షణ ఇస్తామ­న్నారు. తన హయాంలో 11 డీఎస్సీలు నిర్వహించి.. 1.50 లక్షల మందికి టీచర్‌ పోస్టులు ఇచ్చామన్నారు. 

ఇదీ చదవండి: AP DSC Notification Update : ప్ర‌తి ఏటా డీఎస్సీ నిర్వ‌హిస్తాం ఇలా... కానీ..

16,347 మెగా డీఎస్సీ పోస్టులు జూన్‌ నాటికి భర్తీ చేస్తామ­న్నారు. ఇక నుంచి ఏటా డీఎస్సీ ఉంటుందన్నారు. 117జీవో 4 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు రాని పరిస్థితి ఉందన్నారు. రాబోయే ఏడాదికి పాఠశా­లల్లో పెనుమార్పులు తెస్తామ­న్నారు. కాగా సభకు చ్చిన ఓ విద్యార్థి తండ్రి గుండెపోటుకు గురైతే నడిపించుకుంటూ తీసుకెళ్ల­డం ఆందోళనకు గురి చేసింది. సభకు ఎనిమిదో తరగతి చదువుతున్న సాహుల్‌ అనే విద్యార్థి తండ్రి పఠాన్‌బాజీ హాజరయ్యారు. 

ఇదీ చదవండి: DSC SGT Bitbank

ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హై­స్కూ­లుకు పిలిపించారు. సీఎం వచ్చే వరకు అందరినీ  అక్కడి నుంచి లేవకుండా ఉంచారు. కనీసం ఫ్యాన్లు కూడా వేయలేదు. ఈ వాతావరణం మధ్య ఇమడలేక 11 గంటల సమయంలో పఠాన్‌­బాజీ గుండె­పోటుకు గురయ్యాడు. అక్కడే మెడికల్‌ క్యాంపు ఉన్నప్పటికీ వీల్‌చైర్‌ కూడా లేకపోవటం, అంబులెన్సు లేకపోవటంతో బాధితుడిని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags