Ekalavya School Facilities : మా పిల్ల‌ల చ‌దువెలా అంటూ క‌లెక్ట‌ర్ వ‌ద్ద‌కు ఏక‌ల‌వ్య విద్యార్థుల త‌ల్లిదండ్రులు..

టీచర్లు చెప్పేది మా పిల్లలకు అర్థం కాదు.. పిల్లలు చెప్పేది వారికి బోధపడదు.. మార్కులు చూస్తే ఒకటి, రెండే. మరుగుదొడ్లకు వెళ్తే నీళ్లు ఉండవు..

పార్వతీపురం టౌన్‌: ‘‘సమయానికి భోజనం పెట్టరు.. పడుకోవడం, తినడం అక్కడే.. పాఠాలు వినేదీ అక్కడే! టీచర్లు చెప్పేది మా పిల్లలకు అర్థం కాదు.. పిల్లలు చెప్పేది వారికి బోధపడదు.. మార్కులు చూస్తే ఒకటి, రెండే. మరుగుదొడ్లకు వెళ్తే నీళ్లు ఉండవు.. ఇన్ని అవస్థలు నడుమ పిల్లలు ఎలా చదవగలరు.. మేమెలా చదివించగలం..’’ అంటూ ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Primary School : ఈ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఐదు త‌ర‌గ‌తులు.. విద్యార్థులు మాత్రం..

‘సార్‌.. మీరు బాధ్యతలు స్వీకరించగానే పాఠశాలకు వచ్చారు. సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మీరు తలుచుకుంటే ఎంతసేపు?’ అంటూ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు.

Follow our YouTube Channel (Click Here)

జిల్లాలోని పలు ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు కలెక్టరేట్‌కు శనివారం చేరుకున్నారు. కలెక్టర్‌ను చుట్టుముట్టి.. సమస్యలను ఏకరవు పెట్టారు. ప్రధానంగా కురుపాం ఏకలవ్య పాఠశాలలో ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుల తీరుతో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారంతా వివరించారు.

Academy for Competitive Exams : పోటీ ప‌రీక్ష‌ల్లో కల్పవృక్షంగా కౌండిన్య ఐఏఎస్‌ అకాడమీ.. విద్యార్థుల‌కు వ‌రంగా..!

చదువులు సక్రమంగా సాగడం లేదని.. భోజన సదుపాయాలు కూడా సరిగ్గా లేవని వాపోయారు. మెనూ అమలు చేయడం లేదని.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం పెడుతున్నారని.. విద్యార్థుల కంటే టీచర్లే త్వరగా భోజనం చేస్తున్నారని తెలిపారు. తరగతులు, స్టడీ అవర్లు సక్రమంగా నిర్వహించడం లేదని చెప్పారు.

Follow our Instagram Page (Click Here)

దీంతోపాటు సొంత భవనం లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. చాలీచాలని గదులతో అవస్థలు పడుతున్నారని వివరించారు. ఉపాధ్యాయుల్లో హిందీ వారే ఉండటంతో.. బోధించేది పిల్లలకు అర్థం కావడం లేదని తెలిపారు. దీనివల్ల చాలామందికి సున్నా మార్కులు వస్తున్నాయని వాపోయారు.

AP PHC Doctors : ప్ర‌భుత్వానికి వైద్య సంఘం లేఖ‌.. ఈ జీవోను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్‌..!

గిరిజన విద్యార్థులకు అవస్థలు కలిగించొద్దు

గిరిజన విద్యార్థులను అవస్థలకు గురి చేయడం భావ్యం కాదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుల తీరుతో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధానంగా కురుపాం పాఠశాలలో సౌకర్యాలు లేవని.. కనీసం ఫ్యాన్లు కూడా తిరగడం లేదని వివరించారు.

Join our WhatsApp Channel (Click Here)

పరిష్కరిస్తాం.. సమయం పడుతుంది : కలెక్టర్‌

దీనిపై కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ స్పందిస్తూ.. పాఠశాలను మరోచోటకు మారుస్తామని, కాస్త సమయం పడుతుందని చెప్పారు. హిందీ ఉపాధ్యాయులకు తెలుగు వచ్చేందుకు కూడా కొంత సమయం పడుతుందన్నారు. అంతవరకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సాయంత్రం వేళ తెలుగు ఉపాధ్యాయుడిని నియమిస్తామని చెప్పారు. వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కలెక్టర్‌ వద్ద తల్లిదండ్రుల ఆవేదన

Join our Telegram Channel (Click Here)

#Tags