Coaching for Women : మహిళలకు ఈ కోర్సుల్లో నెల రోజుల శిక్షణ.. దరఖాస్తులకు చివరి తేదీ!
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారసంస్థ (మహిళా ప్రాంగణం)లో మహిళలకు టైలరింగ్, స్వీట్స్ అండ్ స్నాక్స్ తయారీ (ఐదో తరగతి ఉత్తీర్ణులు), బ్యూటీషియన్ (పదో తరగతి పాస్/ఫెయిల్) కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ మేరకు సంస్థ జిల్లా మేనేజర్ సీహెచ్‌వీ నరసమ్మ బుధవారం ప్రకటన విడుదల చేశారు. కోర్సు కాల పరిమితి ఒక నెల ఉంటుందని, ఈ నెల 23 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 83339 21340 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
#Tags