October 10th Holiday 2024 : అక్టోబ‌ర్ 10వ తేదీన‌ సెలవు.. ఇవ్వాల్సిందే.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌కు ఇప్ప‌టికే సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా ఉద్యోగులు త‌మ‌కు సెల‌వు ఇవ్వాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ ఉద్యోగులు అక్టోబ‌ర్ 10వ తేదీన అధికారిక సెల‌వు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ అత్యంత ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా సద్దుల బతుకమ్మ జరుపుకునే అక్టోబర్ 10న ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది. 

☛➤ School Holidays Extended 2024 : గుడ్‌న్యూస్‌.. స్కూల్స్ సెల‌వులు పొడ‌గింపు... ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..!

సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని..

మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రోజున ఆప్షనల్ సెలవు కాకుండా రెగ్యులర్ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. దీనిపై స్పందిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు అక్టోబ‌ర్ 10వ తేదీన‌ సెలవు ఉండనుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగులకు అక్టోబర్ 12వ తేదీ శనివారం దసరా పండుగ సంద‌ర్భంగా సెల‌వు ఇచ్చారు.

☛➤ Dussehra Holidays 2024: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, ఒకరోజు అధికంగా..

#Tags