School Education : ఈ స్కూల్‌లో చదవాలంటే... రోజుకు రూ.17000 కట్టాల్సిందే..! దీని ప్రత్యేకత ఇదే..
సాక్షి ఎడ్యుకేషన్: జపాన్‌లో అందించే విద్య గురించి ఇతర దేశాలు ఆకర్శిస్తుంటాయి. వివిధ దేశాల్లో నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే, ఈ దేశంలో పిల్లలకు చదువుతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు, క్రమశిక్షణ, కష్టపడేతత్వం వంటి విషయాలను ప్రాథమిక స్థాయి నుంచే నేర్పిస్తుంటారు.
NIFT Admissions 2025 : నిఫ్ట్‌లో మాస్టర్స్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఉండొకోయ సంస్థ.. కొత్త పథకం..
ఇతర దేశాల ప్రజలకు జపాన్ దేశంలో ఉన్న పాఠశాలలపై ఉన్న ఆసక్తిని చూసిన ఉండొకోయ అనే సంస్థ సరికొత్త పథకాన్ని రూపొందించింది. జపాన్‌కి వచ్చే విదేశీ పర్యటకులు రూ.17వేలు చెల్లిస్తే.. వారికి ఒక రోజంతా అక్కడి మాధ్యమిక పాఠశాల విద్యార్థి పొందే విద్య, శిక్షణ, అనుభవాలను కల్పిస్తామని ప్రకటించింది.
From Eye Doctor to Dictator: కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా ఎదిగిన అసద్..!
అయితే, ఈ ప్యాకేజీలో భాగంగా కాలిగ్రఫీ, కటాన ఫైటింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి వివిధ కార్యక్రమాలు ఉంటాయని, దీనికోసం తూర్పు జపాన్‌లోని ఛిబా ప్రిపెక్షర్‌లో మూసివేసిన ఓ మాధ్యమిక పాఠశాలను ప్రత్యేకంగా సిద్ధం కూడా చేసామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఇందులో పాల్గొనేందుకు అభ్యర్థులకు వయసుతో సంబంధం లేదని.. ఏ వయసు వారైనా సరే ప్రతీ విద్యార్థి పొందే జీవితాన్ని ఆస్వాదించవచ్చని, వారు పొందే ప్రతీ శిక్షణను అనుభవించవచ్చని పేర్కొంది. కాని, ఇక్కడ రోజుకు 30 మందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుందని వివరించింది సంస్థ.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
యూనిఫాం, బోధన, అత్యవసర విషయాలపై కూడా..
అక్కడి వాతావరణానికి తగ్గటుగా యూనిఫాం ఉండాలి. ఒకవేళ, వారి వద్ద సంప్రదాయ కిమోనో ఉంటే అది కూడా ధరించవచ్చని తెలిపింది. జపనీస్ భాషలో కాలిగ్రఫీ అభ్యాసం, నృత్యం వంటి బోధన.. అక్కడ ఉండే భూకంపాలు తెలిసిందే కాబట్టి, ఇటువంటి సందర్భాల్లో ఎలా మనని మనం రక్షించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి.. అనే విషయాలపై కూడా సందర్శకులు పాఠాలు బోధిస్తారు.
Job Mela: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. ఎప్పుడు? ఎక్కడంటే..
జపాన్‌లోని విద్యావిధానంలో భాగంగా అక్కడి తరగతులు పూర్తయిన అనంతరం, సందర్శకులు వారి తరగతులను శుభ్రం చేయాల్సి ఉంటుందని.. ఇది పిల్లలకు సమాజంపై తమ బాధ్యతను గుర్తుచేస్తుందని తెలిపింది. చివరిగా, జపాన్‌లో ఒక రోజు విద్యార్థిగా విద్యాభ్యాసం చేసినందుకు గుర్తుగా సందర్శకులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌ను అందజేస్తామని పేర్కొంది.
ఇలా, జపాన్‌లో ఇతర దేశాల వారు విద్యను అభ్యసించాలంటే వారి వయసుతో పని లేకుండా, అక్కడి వాతావరణం, బోధన, అక్కడి పాఠశాలల్లో బోధించే పాఠాలు, తీరును ఈ పాఠశాలలో బోధిస్తామని జపాన్ సంస్థ ఈ పథకాన్ని రూపోందించింది.