National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు అప్లై చేశారా? ఉండాల్సిన అర్హతలు ఇవే

National Scholarship National Scholarship deadline extended

రాయవరం: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌)కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును అక్టోబరు 3వ తేదీ వరకూ పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు డి.దేవానందరెడ్డి విడుదల చేసిన ప్రకటన మండల విద్యాశాఖ కార్యాలయాలకు చేరింది. అలాగే ప్రింటెడ్‌ నామినల్‌ రోల్‌, ఒరిజినల్‌ ఎస్‌బీఐ కలెక్ట్‌ రశీదును సంబంధిత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించడానికి అక్టోబరు 14 తేదీ గడువుగా పేర్కొన్నారు.

Navodaya Admissions: నవోదయ దరఖాస్తులకు గడువు పెంపు.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే..

కావల్సిన అర్హతలు ఇవే

ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ ప్రవేశ దరఖాస్తుకు అర్హులు. కుటుంబ వార్షికాదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్‌ కార్డులో ఉన్న విధంగానే పేరు నమోదు చేయాలి.

Job Mela: పాలిటెక్నిక్‌ కళాశాలలో రేపు జాబ్‌మేళా

దరఖాస్తు ఫీజు వివరాలు

అప్పుడు ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. అయితే పరీక్ష రాసే సమయానికి అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష రుసుం చెల్లించాలి. ఇతర వివరాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో లేదా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలుసుకోవచ్చు.
 

#Tags