Three days Holiday cancel 2024 : బ్రేకింగ్ న్యూస్ : మార్చి 8, 9, 10 సెల‌వులు ర‌ద్దు.. కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : వ‌రుస‌గా మూడు రోజులు సెల‌వులు వ‌చ్చాయ‌న్న ఆనందం కొద్ది నిమిషాల పాటు కూడా అయినా లేకుండా పోయింది. ప్ర‌భుత్వం బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఇచ్చిన సెల‌వుల‌ను ర‌ద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 శివ‌రాత్రి, రెండో శ‌నివారం, ఆదివారం మార్చి(8,9,10 తేదీల్లో)  ఇలా వ‌రుస‌గా మూడు రోజులు పాటు సెల‌వులు వ‌చ్చాయి. అయితే ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్ జిల్లాల్లో అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు య‌ధావిధిగా ప‌నిచేయాల‌ని.. త‌హ‌సీల్ధారుల‌కు,  సూప‌రింటెండెంట్‌ల‌కు, క‌లెక్ట‌ర్ కార్యాల‌య సిబ్బందికి క‌లెక్ట‌ర్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌, ప్రారంబోత్స‌వాలు ఉండ‌టంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. 

---> స్కూల్స్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఒంటిపూట బ‌డులు ప్రారంభం... ఎప్ప‌టి నుంచి అంటే..?

దీంతో హైద‌రాబాద్ జిల్లాలో వ‌రుస‌గా ఉన్న మూడు రోజుల సెల‌వులు పూర్తిగా ర‌ద్దు అయినాయి. అయితే స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం వ‌రుసగా మూడు రోజుల పాటు సెల‌వులు ఉంటాయి.

#Tags