Kakatiya University: పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా రవికుమార్ బాధ్యతల స్వీకరణ
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా చేకూరి రవికుమా ర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్‌ను వరంగల్‌లోని కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి బదిలీ చేశారు. ఆ స్థానంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. 2010లో ఇదే యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆయన రాసిన పలు వ్యాసా లు జాతీయ, అంతర్జాతీయస్థాయి జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా రవికుమార్‌కు కళాశా ల అధ్యాపకులు,ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
#Tags