INSPIRE for Students : విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పెంచేందుకే ఇన్‌స్పైర్‌..

ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థికీ శాస్త్ర విజ్ఞానం పెంచేందుకే ఇన్‌స్పైర్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రసాద్‌ పే ర్కొన్నారు.

నాయడుపేటటౌన్‌: ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థికీ శాస్త్ర విజ్ఞానం పెంచేందుకే ఇన్‌స్పైర్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రసాద్‌ పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఎల్‌ఏ సాగరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం గూడూరు డివిజన్‌ పరిధిలోని 150 మంది సైన్స్‌ ఉపాధ్యాయులకు సైన్స్‌ ఇన్‌స్పైర్‌ 2024–25 ఏడాదికి సంబంధించి వర్క్‌షాపు నిర్వహించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఈ సందర్భంగా సైన్స్‌ ఇన్‌స్పైర్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక విజ్ఞానం పెంపొందేలా బోధన చేయాలన్నారు. సాంకేతిక అంశాలపై విద్యార్థులతో అధ్యయనం చేయించాలని సూచించారు. అలాగే వర్క్‌షాప్‌ కోఆర్డినేటర్‌ రివేష్‌ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.

Job Mela : ఈనెల 27న ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో జాబ్ మేళా.. అర్హులు!

కల్లూరు పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల విద్యార్థులతో త్వరితగతిన శుభ్రం చేసే అధునాతన పారిశుద్ధ్య పరికరాలకు ఇటీవల జరిగిన సైన్స్‌ ఇన్‌స్పైర్‌ ప్రాజెక్టులో జాతీయస్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కల్లూరు పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా అధికారితో పాటు గూడూరు డిప్యూటీ డీఈఓ శాంతి, ఎంఈఓ మునిరత్నం తదితరులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం అన్నామణి, పాలచ్చూరు రవి, రాజేష్‌, సురేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags