IB Syllabus in Govt Schools: ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్‌పై హర్షం

విశాఖ విద్య: ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్‌ బోధనకు ఏర్పాట్లు చేస్తుండటం ఎంతో హర్షించదగ్గ విషయమని ఏపీ రైట్‌ టు ఎడ్యుకేషన్‌ ఫోరమ్‌ రాష్ట్ర కన్వీనర్‌ నరవ ప్రకాశరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బెంగుళూరులో ఇప్పటికే 40 పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ బోధన జరుగుతుందన్నారు. ఎల్‌కేజీకి రూ.5 లక్షల వరకు ఫీజు ఉంటుందని, అలాంటిది మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగానే ఐబీ సిలబస్‌తో చదువుకునే అవకాశం కల్పిస్తుండటం విద్యారంగంలో గొప్ప మార్పు అన్నారు. దీన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు, మేథావులు స్వాగతించాల్సిన విషయమన్నారు.

చదవండి: Inter Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

#Tags