How to Overcome Exam Stress: పరీక్షల ఒత్తిడి.. ఈ టిప్స్‌ ఫాలో అయితే బెస్ట్‌

పరీక్షలు దగ్గరపడుతున్నాయి. త్వరలోనే ఎంసెట్‌, నీట్‌, జేఈఈ వంటి కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులు ర్యాంకులు, మార్కులు అనే ఒత్తిడిలో పడిపోతుంటారు. ఏడాదంతా ఎంత బాగా చదివినా ఎగ్జామ్స్‌ టైం వచ్చేసరికి తీవ్రమైన ఆందోళన, మానసిక సమస్యలకు గురవుతారు. పైగా మార్కుల గురించి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల భారీ అంచనాలు కూడా వీరిని ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. ఈ క్రమంలో పరీక్షల కాలంలో విద్యార్థులు ఒత్తడి నుంచి ఎలా బయటపడాలి? ఇంతకాలం చదివింది పరీక్షల్లో ఎలా గుర్తుంచుకోవాలి? ప్రణాళికాబద్దంగా ప్రిపరేషన్‌ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి? వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం..!"
How to Overcome Exam Stress

Understand the Exam Format

పరీక్షల ప్రణాళిక కంటే ముందు ఆ ఎగ్జామ్‌ ఫార్మాట్‌ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మల్టీపుల్-చాయిస్, ఎస్సే క్వశ్చన్స్‌ ఎన్ని ఉంటాయి? ప్రతి విభాగానికి ఎన్ని మార్కులు? పరీక్ష సమయం ఎంత వంటి విషయాలను రూపొందించుకొని అందుకు తగ్గట్లు ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి. 

Gather Study Materials

ప్రీవియస్‌ ఎగ్జామ్‌ పేపర్స్‌, నోట్స్‌ వంటివి ముఖ్యమైన మెటీరియల్స్‌ అన్నింటిని దగ్గర పెట్టుకోండి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ రిఫరెన్స్‌లు తీసుకునేటప్పుడు వాటి క్రెడిబిలిటి ఎంత అన్నది క్రాస్‌చెక్‌ చేసుకోవడం ముఖ్యం. కశ్చితమైన సమాచారం ఉన్న మెటీరియల్స్‌నే రిఫర్‌ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. 

Inter Exam Fee 2025: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే

Create a Study Plan

సిలబస్‌ను ఒక రోజులో, వారంలో, నెలలో.. ఎంత పూర్తిచేయొచ్చో ముందే ప్రణాళిక వేసుకోండి. అందుకు తగ్గట్లు సమయాన్ని కేటాయించుకొని అనుకున్న సిలబస్‌ను పూర్తి చేయండి. 

Organize Your Study Space

చిందరవందరగా ఉండే స్టడీ స్పేస్ ఒత్తిడిని కలిగిస్తుంది. మీ స్టడీ డెస్క్ శుభ్రంగా... క్రమబద్ధంగా ఉంచుకోండి, తద్వారా మీరు మీ పనిపై దృష్టి పెట్టవచ్చు.

Spot Admissions: పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ

Take Care of Your Health

పరీక్షల సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. మీ మానసిక, శారీరక ఆరోగ్యం ఈ సమయంలో చాలా ముఖ్యం. అందుకే సరైన ఆహారం తీసుకోండి. 8గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోండి. ప్రతిరోజూ వ్యాయామానికి కొంతసమయం పెట్టుకోండి. జంక్‌ఫుడ్స్‌, అధికంగా కెఫైన్‌, మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి.

 Don't panic: 

పరీక్షకు ముందు ఆందోళన చెందడం సహజం. కానీ మీరు భయపడటం ప్రారంభిస్తే, కొన్ని లోతైన శ్వాసలను తీసుకోండి... విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు సిద్ధంగా ఉన్నారని... మీరు మీ వంతు కృషి చేస్తారని మీకు గుర్తు చేసుకోండి.

Practice:

 ప్రతి రోజు కొన్ని నిమిషాలు రాస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇది మీ విశ్వాసాన్ని పెంచడానికి... ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

Sleep and Exercise: 

క్రమం తప్పకుండా నిద్ర మరియు వ్యాయామం చాలా అవసరం. ప్రతి రోజూ రాత్రి 7-8 గంటలు నిద్రపోండి. వారంలో రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. నిద్ర, వ్యాయామం ఒత్తిడిని తగ్గించడానికి ... అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Final Review Before the Exam

పరీక్షకు ముందురోజు కొత్త సిలబస్‌ జోలికి అస్సలు వెళ్లకండి. ఇది వరకు చదివిన అంశాలను మళ్లీ రివిజన్‌ చేసుకోండి. మీ సొంత నోట్స్‌ను చదువుకోవడం మంచిది. హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఇప్పటిదాకా చదివిన దానిపై పూర్తి నమ్మకంతో, సానుకూలంగా ఉండటం ముఖ్యం

#Tags