JNVST 2025 Hall Ticket : జేఎన్‌వీఎస్‌టీ 2025 ప్ర‌వేశ ప‌రీక్షకు హాల్‌టికెట్ విడుద‌ల‌.. డౌన్‌లోడ్ విధానం ఇలా..!

నవోదయ విద్యాలయ సమితిలో విద్యార్థులు ఆర‌వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశానికి రాసే ప‌రీక్ష జేఎన్‌వీఎస్‌టీ 2025 కు సంబంధించి హాల్‌టికెట్‌ను విడుద‌ల చేశారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: దేశంలో పేరున్న విద్యా సంస్థ‌ల్లో న‌వోద‌య ఒక‌టి. ప్ర‌భుత్వ నుంచి ఎన్ని కొత్త విద్యాసంస్థ‌లు వ‌చ్చినా, దీనికున్న ప్ర‌త్యేక‌త వేరుగానే ఉంటుంది. ఇందులో ఉత్త‌మ విద్య పొంద‌వ‌చ్చ‌ని భావిస్తారు విద్యార్థులు తల్లిదండ్రులు. అటువంటి విద్యాల‌యంలో ప్ర‌వేశం పొందేందుకు నిర్వ‌హించే ప‌రీక్ష‌నే ఇది.

TGPSC Group 2 Mains 2024 : రేపు, ఎల్లుండి గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు.. ఇవి త‌ప్పనిస‌రిగా పాటించాలి.. మ‌హిళ‌ల‌కు మాత్రం..!
 
ఇటీవ‌లె, అధికారులు ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్‌ను విడుద‌ల చేశారు. విద్యార్థులు వారి అడ్‌మిట్ కార్డును https://navodaya.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. జ‌న‌వ‌రి 18వ తేదీన విద్యార్థుల‌కు ఈ ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు.

మార్కుల ఆధారంగానే..

ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతిలో ప్రవేశం ఉంటుంది. ప్రతి నవోదయ విద్యాలయంలో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంతాల పిల్లలకు కేటాయిస్తారు. అంతే కాకుండా SC/ST, OBC, వికలాంగ అభ్యర్థులు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ పొందుతారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

హాల్‌టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

1. మొద‌టిగా నవోదయ విద్యాలయ సమితి అధికారిక‌ వెబ్‌సైట్ navodaya.gov.in కి వెళ్లండి.

2. అడ్మిషన్ బటన్ పై క్లిక్ చేయండి. అందులో అడ్మిషన్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు 6వ‌ తరగతి జేఎన్‌వీఎస్‌టీ 2025 (సమ్మర్ బౌండ్) కోసం అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job Mela: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. జాబ్‌మేళా పూర్తి వివరాలివే!

4. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.

5. ఇప్పుడు అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై వెల్ల‌డౌతుంది. దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags