Free training in electrician courses: ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాలివే!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ కోర్సుకు నూ స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ పీ రజిత ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ శిక్షణకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేందుకు కొన్ని పరిశ్రమల యాజమాన్యాలతో ఐటీఐ కాలేజీ ఒప్పందం చేసుకుందన్నారు. పదో తరగతి ఆపైన చదువుకున్న ఖాళీగా ఉన్న అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, వయసు 30 సంవత్సరాలు లోపు వుండాలన్నారు. ఇతర వివరాలకు 8978524022 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags