Essay Writing Competitions: వ్యాసరచన పోటీలకు ఎంట్రీల ఆహ్వానం..

అనంతపురం కల్చరల్‌: భీమవరానికి చెందిన ఉమర్‌ ఆలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు త్సవటవల్లి మురళీకృష్ణ, డాక్టర్‌ దాయన చంద్రాజీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Essay Writing Competitions

సాంఘిక దురాచారాలను రూపుమాపేలా, మత సామరస్యంపై చైతన్య పరుస్తూ డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా రచించిన ‘బర్హిణీదేవి’ కావ్యాన్ని విశ్లేషిస్తూ వ్యాసాలను రచించి ఈ నెల 20వ తేదీ లోపు ‘డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా సాహితీ సమితి, డోర్‌ నం. 19–22–6, బ్యాంకు కాలనీ, భీమవరం –534201’ చిరునామాకు పంపాలి. విజేతలకు జనవరి 23న భీమవరంలో జరిగే సాహితీ కార్యక్రమంలో ప్రశంసాపత్రాలను నవమ పీఠాధిపతుల చేతుల మీదుగా అందిచనున్నారు. పూర్తి వివరాలకు 99894 87098, 94419 83007లో సంప్రదించవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags