Gurukul Admission Exam: ఈ నెల 25న గురుకులంలో ప్రవేశానికి పరీక్ష..!
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
5, 6, 7, 8 తరగతులకు ఏపీఆర్‌ఎస్ Cat–2024 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, కళాశాలలకు ఏపీఆర్‌జేసీ, డీసీసెట్ – 2024 మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు హాల్‌టికెట్లను https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. అభ్యర్థులు ఐడీతో పాటు పుట్టిన తేదీ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు.
UPSC Exam: రేపు యూపీఎస్సీ పరీక్ష నిర్వహణ.. హాజరుకానున్న అభ్యర్థుల సంఖ్య..!