Education In USA: యూఎస్‌లో చ‌దువుకోవాల‌నుకుంటున్నారా.! అయితే మీ కోస‌మే ఉచితంగా ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌.. ఎక్క‌డంటే..?

అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ ఇన్‌ ద యూఎస్‌ యూనివర్సిటీ ఫేర్‌ నిర్వహిస్తున్నట్లు యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్ ప్ర‌తినిధులు తెలిపారు.
యూఎస్‌లో చ‌దువుకోవాల‌నుకుంటున్నారా.! అయితే మీ కోస‌మే ఉచితంగా ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌.. ఎక్క‌డంటే..?

హైదరాబాద్‌లోని నొవాటెల్‌ కన్వెన్షన్‌లో ఆగస్ట్‌ 26వ తేదీ(శ‌నివారం) ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఫేర్‌ నిర్వహిస్తామని, విద్యార్థుల అనుమానాలన్నింటినీ ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏయే అవకాశాలున్నాయి అడ్మిషన్లు ఎలా పొందాలి? యూనివర్సిటీలను ఎలా ఎంపిక చేసుకోవాలి? వీసాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇమ్మిగ్రేషన్‌ ఇంటర్వ్యూకు ఎలా సన్నద్ధమవ్వాలి? అక్క‌డికి వెళ్లాక‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన క‌ల్పించ‌నున్నారు. ఎలాంటి పార్టిసిపేషన్ ఫీజు ఉండ‌ద‌ని, ఫెయిర్‌కు హాజ‌ర‌య్యే వారు త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల‌ని ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు తెలిపారు.

ఇవీ చ‌ద‌వండి: విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌... ఏడాదికి 75వేల స్కాల‌ర్‌షిప్.. ఇలా అప్లై చేసుకోండి!

ఈ ఫెయిర్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం లభిస్తుంది. అమెరికాలో బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రామ్లను ఎంచుకునే విద్యార్థులకు ఈ ఫెయిర్ దిక్సూచిగా నిల‌వ‌నుంది. విద్యార్థులు https://bit.ly/23EdUSAFairEmail సైట్‌లోకి వెళ్లి డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవ‌చ్చు.

ఇవీ చ‌ద‌వండి: ఆ బ‌డికి వెళ్లాలంటే.. భ‌యం.. ఆ చిన్న‌ పూరి గుడిసెలో చ‌దువు.. చివ‌రికి గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా..

ఫెయిర్ లో యూఎస్ యూనివ‌ర్సిటీలు, విద్యకు సంబంధించిన‌ సలహాదారులు, యూఎస్ ఎంబసీ ప్రతినిధులతో విద్యార్థులు నేరుగా మాట్లాడ‌వ‌చ్చు. మరిన్ని వివరాలకు https://www.facebook.com/EducationUSAIndia, educationusaindia@usief.org.in సైట్‌ను సంప్రదించాల‌ని నిర్వాహ‌కులు సూచించారు. 

ఇవీ చ‌ద‌వండి: National Awards 2023 List : 'పుష్ప' ఎక్క‌డైన‌ తగ్గేదేలె.. అలాగే 'RRR' కూడా..

ఈవెంట్: 2023 ఎడ్యుకేషన్ యూఎస్ఏ "స్టడీ ఇన్ ది యు.ఎస్." యూనివర్శిటీ ఫెయిర్   

తేది: శనివారం, ఆగస్టు 26, 2023   

సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు   

వేదిక: నొవొటెల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్.

రిజిస్ట్రేషన్ కోసం: https://bit.ly/23EdUSAFairEmail

#Tags