Collector Pamela : క‌లెక్ట‌ర్ క్రియేటివిటి.. చిన్నారుల్లో మ‌రింత ఉత్సాహం.. ఈ పాట‌తో!

'ఇది చాలు' అనుకునే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ఇంకా ఏదో తెలుసుకోవాలి... అనే తపన ఉన్న వాళ్లు ఎంతో ముందుకు వెళతారు. అనేదే ఈ క‌లెక్ట‌ర్ ఆశ‌..

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏ ఫర్‌ యాక్టివ్‌. బీ ఫర్‌ బ్రైట్‌.. ఇప్పుడు ఇదే ప్ర‌తీ అంగ‌న్వాడీల్లో పిల్లల నోటినుంచి వినిపించేది. ఇది ఒక క‌లెక్ట‌ర్ వ‌ల్ల సాధ్య‌మైంది. మ‌న‌కు ఒక‌టి నేర్చుకోవాలి అనుకుంటే జీవితంలో ఎంతైనా నేర్చుకోవ‌చ్చు. క‌లెక్ట‌ర్ ప‌మేల ఈ  కోవకు చెందిన మ‌హిళ‌. అస‌లు క‌థేంటో చూద్దాం..

బ‌హు భాష‌ల‌తో స‌భాష్‌..

'ఇది చాలు' అనుకునే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ఇంకా ఏదో తెలుసుకోవాలి... అనే తపన ఉన్న వాళ్లు ఎంతో ముందుకు వెళతారు. కలెక్టర్‌ పమేలా రెండో కోవకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలని తపించే జ్ఞానపిపాసీ. ఆమె మాతృభాష ఒడియా. హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతారు.

National Championship: జార్ఖండ్‌.. జాతీయ సబ్‌ జూనియర్‌ మహిళల హాకీ విజేత

తెలుగు రాయగలరు, చదవగలరు. భద్రాచలంలో పనిచేసే సమయంలో అక్కడ గిరిజనుల బాధలు వారి నోట నుంచి తెలుసుకునేందుకు కోయ భాష నేర్చుకున్నారు పమేలా. కరీంనగర్‌కు వచ్చాక ఆమెకు ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. ఇందుకు సంబంధించ‌న కోర్సును కూడా పూర్తి చేశారు.

అల్ఫాబెట్స్‌ను స‌రికొత్త ప‌దాల‌తో పాట‌గా..

కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి.. ఈ క‌లెక్ట‌ర్‌కి కొత్త విష‌యాలు తెలుసోవాలి అనే ఆశ ఎక్క‌వ ఉంటుంది. ఎప్పుడైనా, ఎక్క‌డైనా, ఎవ్వ‌రైనా, ఏమైనా నేర్చుకోవ‌చ్చు అని భావించే వ్యక్తి. అయితే, త‌నకు ఐదేళ్ల క్రితం కుమారుడు నైతిక్ పుట్టిన‌ప్పుడు త‌న మ‌దిలో మెలిగిన పాటే ఏ ఫర్‌ యాక్టివ్‌. బీ ఫర్‌ బ్రైట్ ఇది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అయితే, త‌న మ‌దిలో మెలిగిన క్ష‌ణంలోనే త‌న పుస్త‌కంలో అక్ష‌రాలుగా మార్చి నేడు చాలామంది విద్యార్థుల‌కు నేర్చుకోవ‌డం అనేది సుల‌భం చేశారు. ఇదొక్క‌టే కాదు, ఈ క‌లెక్ట‌ర్‌కు ఉండే నేర్చుకోవాల‌న్న ఆశ‌తో త‌న‌కు తానే ఎన్నో విష‌యాల‌ను త‌న క్రియేటివిటీతో మ‌లిచి సులువుగా అర్థం చేసుకునే విధంగా మార్చింది.

Gurukul Admissions: గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌

అంగ్వాడీల్లో ఆడుతూ.. పాడుతూ..

క‌లెక్ట‌ర్ స‌త్ప‌తి.. కోయ, ఉర్దూ భాషలు నేర్చుకున్నారు. వ్యక్తిత్వ వికాస కోణంలో పిల్లల పాటలు రాస్తారు. ఉద్యోగ బాధ్యతలకు సృజనాత్మకత జోడిస్తారు. అయితే, త‌న కుమారుడికి ఈ పాటను నేర్పించే క్ర‌మంలో క‌లెక్ట‌రేట్‌లోని ఒక సిబ్బందికి కొత్త‌గా ఆక‌ట్టుకుంది. దీంతో ఈ పాట‌ను ప్ర‌తీ అంగ‌న్వాడీల్లోకి చేర్చితే పిల్లలంతా మ‌రింత ఉత్సాహంతో ఆడుతూ.. పాడుతూ.. నేర్చుకుంటార‌ని, పాట సృజనాత్మకంగా ఉందిని సూచించ‌డంతో ప‌మేలా స‌రే అంటూ ఆమోదం తెలిపారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

అంగ‌న్వాడీల బ‌లోపేతంపై దృష్టి..

అప్పుడ‌ప్పుడే క‌లెక్ట‌ర్ ప‌మేలకు కూడా అంగ‌న్వాడీల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి, బలోపేతం చేయాల‌నుకున్నారు. అదే స‌మ‌యంలో క‌లెక్ట‌రేట్ సిబ్బంది ఈ సూచ‌న ఇవ్వ‌డంతో మ‌రింత సులువైంది. ఇలా, అంగన్వాడీల్లో విద్యా, పోష‌ణ వంటివి బలవర్ధ్దక ఆహారంతో పిల్ల‌ల‌కు సరిగ్గా, స‌మ‌యానికి అందించాల‌ని భావించారు. అంతేకాకుండా, విద్యాలో కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా, ఆట‌పాటల‌తో చ‌దువును అందించాల‌నుకున్నారు.

TS TET Exam Dates and Syllabus 2025 : టెట్ 2025 సిల‌బ‌స్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీలు ఇవే.. ఇంకా..

ఈ స‌మ‌యంలోనే ప‌మేల రాసిన పాట‌ను వీడియో రూపంలో విడుద‌ల చేసి పిల్ల‌ల‌కు వినిపించ‌డం ప్రారంభించారు. ఈ పాట పిల్ల‌ల‌కు ఎంతో న‌చ్చేసింది. ''ఇది కేవలం పాట మాత్రమే కాదు.. పాట రూపంలో ఎన్నో విషయాలను పిల్లలకు సులభంగా చెబుతున్న పాఠం కూడా'' అని వివ‌రించారు ప‌మేల‌.

#Tags