Career Guidance : 8 నుంచి 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కెరీర్ గైడెన్స్‌పై శిక్ష‌ణ‌

రేణిగుంట: ఏర్పేడు మండలం నేచనేరి సమీపంలో ఉన్న ఎస్‌ఓఎస్‌ బాలల గ్రామంలో ఆదివారం 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏర్పేడు, శ్రీకాళహస్తి, వెంకటగిరి మండలాల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Entrance Exam Application : జ‌వ‌హార్ న‌వోద‌య ప్రవేశ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడ‌గింపు!

ప్రముఖ కెరీర్‌ గైడెన్స్‌ నిపుణురాలు డా.సుమయ మాట్లాడుతూ 10వ తరగతి తర్వాత అందుబాటులో ఉన్న విద్యాకోర్సులు, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే భవిష్యత్‌ ప్రణాళికపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. భవిష్యత్‌లో సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి అనుగుణంగా, వ్యక్తిగత ఆసక్తి, లక్ష్యాలను గుర్తించడం ఎంత ముఖ్యమో వివరించారు. కార్యక్రమంలో లొకేషన్‌ ఇన్‌చార్జ్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags