Campus Placement: క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు..

తిరుపతి సిటీ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 14 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్టు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి సత్యనారాయణ, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ చంద్రయ్య తెలిపారు.
Campus Placement for degree students

చైన్నెకి చెందిన సౌతర్న్‌ ఇన్ఫోటెక్‌ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సుమారు వందమంది విద్యార్థులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారని పేర్కొన్నారు.

Essay Writing Competitions: వ్యాసరచన పోటీలకు ఎంట్రీల ఆహ్వానం..

వార్షిక వేతనం రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలతో 14 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. విద్యార్థులకు ఉపాధే లక్ష్యంగా నాణ్యమైన బోధనతో పాటు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు. నోడల్‌ ఆఫీ సర్‌ సుజాత, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags