ITI students: ఐటీఐ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మంచిర్యాల అర్బన్: ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ వారధిగా నిలుస్తోంది. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశం లభిస్తోంది. ఇంత ప్రాధాన్యం ఉన్న పాలిటెక్నిక్ కోర్సులో నేరుగా చేరేందుకు ఐటీఐ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కోర్సులో చేరేందుకు బ్రిడ్జి కోర్సులను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందవచ్చు. ఈ నెల 31వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.
దరఖాస్తుల పక్రియ ప్రారంభం
పాలిటెక్నిక్‌లో చేరేందుకు ఐటీఐ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ప్రవేశపెట్టారు. జిల్లాలో 12 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలున్నాయి. మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, జన్నారంలో ప్రభుత్వ ఐటీఐలు ఉండగా ఎనిమిది ప్రైవేట్ కళాశాలలున్నాయి. మంచిర్యాల ఐటీఐలో బ్రిడ్జి కోర్సు ప్రవేశానికి దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. పదో తరగతి మెమో, ఐటీఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో ఈ నెల 31లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు. థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. తర్వాత ఎల్పీ సెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా 2024–25 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు కల్పించనున్నారు.
చదవండి: SMC Elections: ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు
31తుది గడువు
ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకున్న వారంతా పాలిటెక్నిక్ కోర్సు ప్రవేశాలకు నిర్వహిస్తున్న బ్రిడ్జి కోర్సు సద్వినియోగం చేసుకోవాలి. బ్రిడ్జి కోర్సులో ప్రవేశాలకు జిల్లాలో 40 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 31 వరకు తుది గడువు ఉందని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 31లోపు దరఖాస్తులు చేసుకోవాలి.
– చందర్, ఐటీఐ ప్రిన్సిపాల్, మంచిర్యాల