Awareness Program : అక్టోబ‌ర్ 2న మిలిట‌రీ, సైనిక్ స్కూళ్ల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు..

మిలటరీ, సైనిక్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలకు సంబంధించి తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం టాలెంట్‌ స్కూలులో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.

తిరుపతి: 2025–26 విద్యా సంవత్సరంలో మిలటరీ, సైనిక్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలకు సంబంధించి తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం టాలెంట్‌ స్కూలులో అక్టోబరు 2వ తేదీ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఆ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

World Teacher's Day : వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు

రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌, సైనిక్‌ స్కూల్‌ 6, 9వ తరగతిలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సుకు 5 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావచ్చన్నారు. ఆయా పరీక్షలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడంతోపాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags