APRCET Exam Results 2024: ఏపీఆర్‌ సెట్‌లో స్టేట్‌ సెకండ్‌ ర్యాంక్‌ సాధించిన భానురేఖ..

రాయవరం/బిక్కవోలు: ఆంధ్రప్రదేశ్‌ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన తేతలి భానురేఖ రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్‌ సాధించారు. ఈ విషయాన్ని భానురేఖ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 3న తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించిందన్నారు.

Job Interviews: ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉ‍ద్యోగం

రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షకు హాజరు కాగా, అందులో 4,500 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారన్నారు. ఈ నెల మొదటి వారంలో ఆదికవి నన్నయ యూనివర్శిటీలో ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. 91808027008 హాల్‌ టికెట్‌ నంబరుతో 146 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించినట్లు తెలిపారు.

Polycet admissions 2024: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

కాగా భానురేఖ గతంలో బీటెక్‌, ఎంబీఏలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేయాలనే లక్ష్యంతో ఏపీఆర్‌సెట్‌కు దరఖాస్తు చేసినట్లు ఆమె తెలిపారు.
 

#Tags