Apprentice Mela At ITI College: ఐటీఐ విద్యార్థుల కోసం.. ఈనెల 9న అప్రెంటిస్‌ మేళా

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల 9వ తేదీన నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్‌ ఎం.కనకరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ కోర్సు పూర్తి చేసి అన్ని ట్రేడ్‌ల వారు ఈ మేళాలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు.
Apprentice Mela At ITI College

ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరై వారి కంపెనీల్లో అప్రెంటీస్‌గా అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు.ఐటీఐ పాస్‌ అయి అప్రెంటీస్‌ పూర్తి కాని వారు విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో ఈ మేళాకు హాజరు కావాలని తెలిపారు.

University of Hyderabad Recruitment 2024: జూనియర్ రీసర్చ్ ఫెలో రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల..

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రమేష్‌ ఆసుపత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో 9వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9298605175 నంబరులో సంప్రదించాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags