Tenth Class Rankers: ప‌దో త‌ర‌గ‌తిలో ప్రతిభ చాటిన విద్యార్థుల‌కు పుర‌స్కారాలు..

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో ఉత్త‌మ మార్కుల‌ను సాధించిన విద్యార్థులకు, వారికి అన్ని విధాల స‌హ‌కారం అందించిన పాఠ‌శాల యాజ‌మాన్యానికి డీఈఓ అభినంద‌న‌లు తెలిపారు..

కోదాడ: జిల్లా యత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేయడంతోనే జిల్లాలో ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించామని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) అశోక్‌ అన్నారు. శుక్రవారం కోదాడలోని కేటీఎస్‌ పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన పాఠశాలల యాజమాన్యాలు, 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Corporate Colleges: కార్పొరేట్ క‌ళాశాల‌లో గిరిజ‌న విద్యార్థుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యాసంవత్సరం సూర్యాపేట జిల్లాను పది ఫలితాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. అనంతరం 10 జీపీఏ సాధించిన 161 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్‌, శ్రీనయ్య, శ్రావణ్‌, జనార్దన్‌, ప్రతాప్‌, చత్రునాయక్‌, బాణాల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

TS DSC 2024 Exam Updates : నత్తనడకన మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ.. త్వరలోనే షెడ్యూల్‌ విడుదల

#Tags