All-Round Development : పాఠ‌శాల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి.. ఈ విష‌యాల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా ప్రధానోపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశించారు.

కాకినాడ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా ప్రధానోపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యాన కాకినాడ జేఎన్‌టీయూ అలుమ్ని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ఎంఈఓలు, హెచ్‌ఎంల సమీక్షలో ఆయన మాట్లాడారు. చిన్న పిల్లలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Jobs In Hetero Labs Limited: ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే

మత్తు పదార్ధాలు చెడు వ్యసనాల బారిన పడకుండా విద్యార్థులను ఉపాధ్యాయులు రోజూ నిశిత పరిశీలన చేసి, సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు నూరు శాతం నమోదయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో 49 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

విజ్ఞాన శాస్త్రాల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేలా ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. ఈ ల్యాబ్‌ల సక్రమ నిర్వహణకు ఉపాధ్యాయులకు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జిల్లాలో అపార్‌ నమోదు వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

Job Mela: సేల్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్వ్యూ ఎప్పుడంటే..

వచ్చే నెల 7న అన్ని పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశాలను విజయవంతం చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి కలెక్టర్‌, డీఈఓ పి.రమేష్‌ పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags