Skip to main content

TS Tenth Class Result 2022 Link : ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను జూన్‌ 30వ తేదీన విడుదల చేశారు. ఈ ఫ‌లితాల‌ను ఉదయం 11:30 గంటలకు డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో తెలంగాణ విద్యాశాఖ‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు.
TS SSC Results 2022 - sabitha indra reddy

ఈ సారి  ఉత్తీర్ణ‌త శాతం 90 శాతం న‌మోదు అయింది. ఈ సారి బాలిక‌ల‌దే పై చేయి సాధించారు. ఇందులో బాలిక‌లు 92.45 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు.ఈ సారి పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా. అలాగే బాలురు 87.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్‌ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 15 స్కూల్స్‌లో ఒక్కరూ కూడా పాస్‌ అవలేదని మంత్రి తెలిపారు. 3007 పాఠశాలల్లో 100 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com)లో చూడొచ్చు. ఆగస్టు 1వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు.

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

How to check TS 10th Class 2022 Results:
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS 10th Class 2022 results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference

ఈ సారి టెన్త్‌లో ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను..

మే 23వ తేదీ నుంచి జూన్‌ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. ఈ సారి పరీక్షల సమయాన్ని కూడా పెంచారు. టెన్త్‌లో ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్‌ మాత్రమే ఇచ్చారు.

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

 5,08,110 మంది విద్యార్థులు
ఈసారి మొత్తం 2,861 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 5,08,110 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 1,165 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు.

Published date : 30 Jun 2022 01:36PM

Photo Stories