Skip to main content

Guest Faculty Jobs: గెస్ట్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు రేపు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే..

Guest Faculty Jobs  Dr. BR Government Degree and PG College guest faculty recruitment  Guest faculty recruitment announcement for computer science applications in Jadcharla
Guest Faculty Jobs

జడ్చర్ల టౌన్‌: పట్టణంలోని డా.బీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అప్లికేషన్స్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ(అతిథి అధ్యాపకుడి)గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డా.సుకన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

10వ తరగతి ఇంటర్ అర్హతలతో ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ ఉద్యోగాలు జీతం నెలకు 69,100: Click Here

సంబంధిత పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అయితే 50 శాతం మార్కులు వచ్చి ఉండాలని పేర్కొన్నారు. సబ్జెక్ట్‌లో ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని, ఈనెల 24వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. 25వ తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

ముఖ్య సమాచారం:

గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు
విద్యార్హత: పీజీలో 55% ఉత్తీర్ణత
ఇంటర్వ్యూ ఎప్పుడు: జనవరి 25న
ఇంటర్వ్యూ ఎక్కడ: డా.బీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌.

Published date : 25 Jan 2025 08:36AM

Photo Stories