Skip to main content

Railway jobs: B.Tech అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు జీతం నెలకు 50,721

RITES Ltd career opportunity  Railway jobs   RITES Ltd recruitment  300 vacancies announcement"
Railway jobs

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ అయిన RITES Ltd నుండి 300 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు ఆన్లైన్ విధానంలో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లై చేయవచ్చు.

డిగ్రీ అర్హతతో BHEL లో 400 ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 50,000: Click Here

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : RITES Ltd నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

భర్తీ చేస్తున్న పోస్టులు : ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : RITES Ltd నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు : 
ఇంజనీర్ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో B.E / B.Tech విద్యార్హత ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు B.E / B.Tech విద్యార్హతతో పాటు రెండేళ్ళ అనుభవం ఉండాలి.
మేనేజర్ ఉద్యోగాలకు B.E / B.Tech విద్యార్హతతో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు B.E / B.Tech విద్యార్హతతో పాటు పది సంవత్సరాలు అనుభవం ఉండాలి.

జీతం : 
ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 41,241/- జీతము ఇస్తారు.
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 42,478/- జీతము ఇస్తారు.
మేనేజర్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 46,417/- జీతము ఇస్తారు.
సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 50,721/- జీతము ఇస్తారు.

వయస్సు : 
ఇంజనీర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 31 సంవత్సరాలు.
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు.
మేనేజర్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 38 సంవత్సరాలు.

వయసులో సడలింపు వివరాలు : 
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
OBC అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 
UR / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 600/- 
SC , ST , PWD, EWS అభ్యర్థులకు అప్లికేషన్ 300/-

అప్లై విధానము : అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు 20-02-2025 తేది నుండి అప్లై చేయాలి.

ఎంపిక విధానం : వ్రాత పరీక్ష , ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

Notification Full Details: Click Here

Apply Online: Click Here

Published date : 05 Feb 2025 09:42AM

Photo Stories