Mega Job Fair: రాజంపేటలో మెగా జాబ్ మేళా
ఈ మేరకు ఏప్రిల్ 13న ఏఐటీఎస్ క్యాంపస్‌లో ఏర్పాట్లను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్‌మేళాకు 80కి పైగా బహుళజాతి కంపెనీల ప్రతినిధులు వస్తారన్నారు. నిరుద్యోగులకు ఉచిత బస్సు, భోజన సౌకర్యం కల్పించామన్నారు. అంతకముందు ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, రాజంపేట రూరల్ సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ భక్తవత్సలం, అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ నారాయణ, ఏఓ సుబ్బారెడ్డిలతో మెగాజాబ్‌మేళా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట ఎంపీపీ గడ్డెం జనార్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: HSL Recruitment 2023: హిందుస్థాన్ షిప్‌యార్డ్, విశాఖపట్నంలో 43 పోస్టులు
జాబ్‌మేళాలో పాల్గొనే వారి కోసం..
ఏఐటీఎస్ క్యాంపస్‌లో నిర్వహించే మెగా జాబ్‌మేళాలో పాల్గొనే నిరుద్యోగుల నమోదు కోసం క్యూ ఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వివరాలకు 9740212687, 9885797909, 94914 75836 నంబర్లను సంప్రందించాలని కోరారు.
చదవండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, మంగళగిరిలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.67,700 వరకు వేతనం..