Free Training in Hotel Management: హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ
పార్వతీపురం: కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్‌లో ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు తిరుపతి స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.రమణ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని జూపార్క్‌వద్ద ఉన్న భారత పర్యటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలతో సంయుక్తంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తీర్ణులై 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగిన యువత దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 15లోగా హెచ్‌టీటీపీఎస్://ఆర్‌బీ.జీవై/6జేయూడీఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకోసం ఫోన్ 9160912690, 9100558006, 9032697478 నంబర్లలో సంప్రదించాలని కోరారు.