Skip to main content

Agriculture Department jobs: డిగ్రీ అర్హతతో AP వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 35,400

agriculture department jobs   AP Agriculture Department Assistant job notification 2024 Eligibility criteria for AP Agriculture Department Assistant jobs
agriculture department jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

అటవీ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 67,000: Click Here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి విడుదల చేశారు.

పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ , ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్టులు సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
టెక్నికల్ అసిస్టెంట్: 05
ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్: 04
ట్రాక్టర్ డ్రైవర్: 01

అర్హత:
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనీసం 55% మార్కులతో అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
ఫీల్డ్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ / సీడ్ టెక్నాలజీలో  డిగ్రీ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.
ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు డ్రైవింగ్ అనుభవం మరియు మోటార్ మెకానిక్ వర్క్ తెలిసి ఉండాలి.

గరిష్ట వయస్సు: గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు: 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

జీతం: 
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35,400/- పాటు DA + HRA కూడా ఇస్తారు.
ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200/- ఉద్యోగాలకు DA + HRA కూడా ఇస్తారు.
ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకు 21,700/- జీతంతో పాటు DA మరియు HRA ఇస్తారు.

ఫీజు: ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇంటర్వ్యూ తేదీ: 28-01-2025 తేదిన ఉదయం 10:00 గంటలకు నుండి ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.

అప్లై విధానము: ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

ఎంపిక విధానం: ఈ పోస్టులకు అర్హులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు. ఇంటర్వ్యూకు హాజరైన వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

ఇంటర్వ్యూ ప్రదేశం: Administrative Office , ANGRAU, Lam, Guntur

Download Notification: Click Here

Official Website: Click Here

Published date : 17 Jan 2025 08:46AM

Photo Stories