Schools and Colleges Holidays : నేడు స్కూల్స్, కాలేజీలు సెలవులు.. ఎందుకంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 9వ తేదీన (శుక్రవారం) హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.
TS Schools and Colleges Holiday
సెప్టెంబర్ 9వ తేదీన సెలవు తీసుకుంటున్నందున ఈ నెల 10న రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.