Skip to main content

Schools & Colleges Holidays : ఈ ఐదు జిల్లాల్లో స్కూల్స్‌, కాలేజీలు సెల‌వులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: దేశవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
Schools and Colleges Holidays
Schools and Colleges Holidays

అలాగే నేడు తాజాగా ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఐదు రహదారులను అధికారులు మూసివేశారు. ఇక, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అప్రమతమయ్యారు. బాగేశ్వర్, తెహ్రీ, పౌరి, పితోరాఘర్, నైనిటాల్ జిల్లాల్లో 1-12వ తరగతి వరకు పాఠశాలలు, అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు బుధవారం మూసివేసినట్టు తెలిపారు. ఇక, డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ జిల్లాలకు జూలై 20న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..

దేశ రాజధాని ఢిల్లీలో సైతం..

Schools Holidays


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం జోషిమత్‌లోని పుర్సరి వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్-58 కుంగిపోయింది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్‌ ప్రకటిచింది.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఇటీవ‌ల తెలంగాణ‌లో కూడా..
ఇటీవ‌ల తెలంగాణ‌లో అన్ని విద్యా సంస్థలకు మరో 3 రోజులు సెలవులు పొడిగించిన విష‌యం తెల్సిందే. భారీ వర్షాలుండటంతో 3రోజులు సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం జూలై 10న ప్రకటించింది. జూలై 14 నుంచి విద్యాసంస్థలు తెరవాల్సి ఉంది. కానీ మరో 3 రోజులు వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పరిస్థితిని సమీక్షించిన అధికారులు జూలై 14 నుంచి 16 వరకూ సెలవులు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. 17వ తేదీ ఆదివారం సెలవు కావడంతో విద్యా సంస్థలు 18న పునఃప్రారంభ అయిన విష‌యం తెల్సిందే.

పదో తరగతి మోడల్ పేపర్లు

పదో తరగతి ప్రివియస్‌ పేపర్స్

పదో తరగతి స్డడీ మెటీరియల్‌

పదో తరగతి సిలబస్

పదో తరగతి టెక్స్ట్ బుక్స్

మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

Published date : 20 Jul 2022 12:04PM

Photo Stories