Skip to main content

Regional Languages for Engineering : 12 భారతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ పాఠ్య పుస్తకాలు.. 10 నిమిషాల్లో తర్జుమా

2026 డిసెంబర్‌ నాటికి 12 భారతీయ భాషల్లో పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెట్టనుంది ఏఐసీటీఈ.
Regional languages for engineering education

సాక్షి ఎడ్యుకేషన్‌: దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ ఇంజినీరింగ్‌ విద్యను అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. అంతేకాదు, స్థానిక భాషల్లో ఇంజినీరింగ్‌  పాఠ్య పుస్తకాలను కూడా అందించడానికి కసరత్తు చేస్తోంది. దీంతో, ప్రాథమిక, హైస్కూల్‌ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్‌లో ఆంగ్ల మాధ్యమంతో ఇబ్బందులు పడుతున్న వారు స్థానిక భాషలోనే చదువుకుని అర్థం చేసుకునేందుకు వీలుకల్పిపస్తోంది. 

2026 డిసెంబర్‌ నాటికి 12 భారతీయ భాషల్లో పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనుంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో బోధనకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల రూపకల్పనలో నిమగ్నమయింది.

– సాక్షి, అమరావతి

JEE Main 2025 Session 2 Top 10 Toppers: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 టాప్ 10 టాపర్స్ .... నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

స్థానిక భాషలో పెరుగుతోన్న ఆదరణ

సాంకేతిక విద్యా వ్యవస్థలో భాషా అవరోధాన్ని నివారించడానికి ఏఐసీటీఈ గతంలోనే ప్రాంతీయ భాషలో ఇంజినీరింగ్‌ విద్యను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా 18 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ ప్రోగ్రామ్‌ కోసం 11 ప్రాంతీయ భాషల్లో 1140 సీట్లను ఏఐసీటీఈ ఆమోదించింది. తొలి ఏడాది 2021–22లో కేవలం 233 సీట్లు మాత్రమే భర్తీ అవ్వగా 80 శాతం మేర ఖాళీగా ఉండిపోయాయి. ఆ తర్వాత ఏడాది 2022–23లో 683 సీట్లు, 2023–24లో 928 సీట్లలో విద్యార్థులు చేరారు.    

కృత్రిమ మేధ సాయంతో 10 నిమిషాల్లో తర్జుమా

ఇంజినీరింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలను ఏఐసీటీఈ రూపొందిస్తోంది.

TG Inter Results: 22న ఇంటర్ ఫలితాలు విడుదల.. sakshieducation.comలో అందుబాటులో!

ఈ పుస్తకాలను స్థానిక భాషల్లో వేగంగా తర్జుమా చేసేందుకు కృత్రిమమేధ సాయాన్ని తీసుకుంటోంది. దాదాపు 80 శాతం కచ్చితత్వంతో 10 నిమిషాల్లో పుస్తకాన్ని తర్జుమా చేస్తోంది. మిగిలిన 20 శాతం తప్పొప్పులను నిపుణులు సరిదిద్దుతున్నారు. 

వాస్తవానికి రాజ్యాంగం 22 ప్రాంతీయ భాషలను గుర్తించినప్పటికీ నిధుల కొరతతో తొలుత 12 స్థానిక భాషల్లో అనువదిస్తోంది. కెనడా, స్విట్జర్లాండ్‌ దేశాలు స్థానిక భాషల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అనుమతిస్తున్నాయి. ఇదే బాటలో రష్యా, చైనా, జపాన్‌  ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోనూ మాతృభాషలో ఇంజనీరింగ్‌ పాఠ్యాంశాలను ఏఐసీటీఈ ప్రోత్సహిస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Apr 2025 03:30PM

Photo Stories