NCC training: ఎన్‌సీసీ శిక్షణ.. ఉన్నతికి నిచ్చెన

పెదవేగి : పెదవేగి మండలం పినకడిమి గ్రామంలోని విన్సెంట్ డీపాల్ కళాశాలల్లో ఇండియన్ ఆర్మీ 19వ ఆంధ్రా బెటాలియన్ కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో ఎన్‌సీపీ శిక్షణ ఉత్సాహంగా సాగుతోంది. మొత్తం 5 కళాశాలలు, 12 పాఠశాలల నుంచి 602 మంది కేడెట్లు ఈ క్యాంప్‌లో పాల్గొని వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకుంటున్నారు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు!: Click Here
గత నెల 24 నుంచి ఈ శిక్షణ ప్రారంభం కాగా ఈనెల 3వ తేదీతో ముగుస్తుంది. శిక్షణలో భాగంగా రైఫిల్ షూటింగ్, డ్రిల్, దేశ సరిహద్దుల్లో ఆర్మీ శిబిరాలు ఏ విధంగా ఉంటాయో కేడెట్లకు అవగాహన కల్పించారు. ఎన్‌సీసీలో శిక్షణ ద్వారా దేశభక్తి, నైతిక విలువలు పెంపొందింపజేయడం, క్రమశిక్షణ, సాయం చేసే తత్వం అలవడతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడంతోపాటు వివిధ రకాల ఉద్యోగాలు, కళాశాలల అడ్మిషన్‌లలో ప్రాధాన్యత కల్పిస్తారు.
సుబేదార్ మేజర్ జె ఆదినారాయణ, ఎన్‌సీసీ అధికారులు ఎం సోమశేఖర్, కె భీమేశ్వరరావు, ఎన్ అనంత రాజ్యలక్ష్మి, లాజరస్, వలీ, ధనరాజు, చీలి తంబి, వీ రమ, సూపరింటెండెంట్ కొండయ్య, ఆర్మీ, సివిల్ సిబ్బంది ఈ ఎన్‌సీపీ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు.
అన్ని రకాల స్ట్రక్చర్ ట్రైనింగ్ ఇస్తున్నాం
ఈ క్యాంప్‌లో మిలటరీ క్రమశిక్షణను విద్యార్థులు నేర్చుకున్నారు. మ్యాప్ రీడింగ్, షూటింగ్, నేషనల్ ఇంటిగ్రేటర్ సిమిలేటర్ ఫైరింగ్, వెపన్ హ్యాండ్లింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చాం. చాలెంజ్‌లు స్వీకరించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంపై నైపుణ్యం కలిగిన వ్యక్తులతో అవగాహన కల్పించాం. రోడ్డు భద్రతా చర్యలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అన్ని రకాల స్ట్రక్చర్ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు దేహదారుడ్యం, ప్రాథమిక యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇచ్చాం. ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు డ్రగ్స్ చెడు పరిణామాలపై అవగాహన కల్పించారు.
– కల్నల్ అమిత్‌పాండే, క్యాంప్ కమాండింగ్ అథికారి, 19 ఆంధ్రా బెటాలియన్
Tags
- NCC training camp Pedavegi
- Pinakadimi village NCC activities
- Vincent De Paul College NCC camp
- NCC camp near Eluru Andhra Pradesh
- NCC training Pedavegi Mandal
- Indian Army 19 Andhra Battalion NCC training
- NCC rifle shooting and drill training
- NCC cadet training program 2025
- Career skills through NCC training
- VincentDePaulColleges
- NCCCadets
- AndhraPradeshEvents