Skip to main content

G-20 model summit program 2023: పాఠశాలలో జీ–20 దేశాల మోడల్‌ సమ్మిట్‌

పొందూరు: ఏపీ నేషనల్‌ గ్రీన్‌కోర్‌ ఆధ్వర్యంలో తాడివలస ఉన్నత పాఠశాలలో జీ–20 దేశాల మోడల్‌ సమ్మిట్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
జీ–20 నమూనా సదస్సులో పాల్గొన్న విద్యార్థులు
జీ–20 నమూనా సదస్సులో పాల్గొన్న విద్యార్థులు

విద్యార్థులే 20 దేశాలకు చెందిన ప్రతినిధులుగా వ్యవహరించారు. ఇంగ్లిష్‌లో ధారాళంగా మా ట్లాడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పర్యావరణ పరిస్థితితులు, జీవ వైవిద్యాన్ని కాపాడడం, సంప్రదాయ జ్ఞానం భావితరాలకు అందించడం, సేంద్రీయ ఆహారం వాడకం, గనుల అక్రమ తవ్వకాలు, సముద్ర జలాల్లో చేపలను అతిగా పట్టడం తద్వారా జరిగే నష్టాలను అంచనా వేసేందుకు చర్యలు, గ్రీన్‌ హౌస్‌ ప్రభావం, వాతావరణ మార్పులు, అడవులను సంరక్షించే బాధ్యత వహించాల్సిన అవసరం, ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ను పునర్వినియోగపరచడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

"Breaking News: Bharat - India's New Name Revealed #sakshieducation

Published date : 06 Sep 2023 06:05PM

Photo Stories