Krishna University : 6వ సెమిస్టర్ ఫలితాలు విడుదల.. 98.99 శాతం ఉత్తీర్ణత..

సాక్షి ఎడ్యుకేషన్: కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన యూజీ 6వ సెమిష్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు అధికారులు. మే 7వ తేదీన.. బుధవారం, విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆచార్య రాంజీ ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులంతా తమ అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి ఫలితాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. వారి ఫలితాలను పరిశీలించుకుని, ప్రింట్ తీసుకోవాలని సూచించారు.
Google Employees Layoffs : గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్.. మరోసారి లేఆఫ్‌లు.. సర్దుబాటులో భాగమే..
విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలకు చెందిన రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 5,341 మంది పరీక్షలకు హాజరవ్వగా అందులో 5,287 మంది ఉత్తీర్ణత సాధిండం విశేషం. ఇక, రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత 98.99 శాతం ఉండగా, సప్లిమెంటరీ విద్యార్థుల ఉత్తీర్ణత 42.27 శాతంగా ఉంది. పునః మూల్యాంకనం కోసం సూచించిన రుసుం చెల్లించి ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్షల నియంత్రణాధికారి డా. పి.వీరబ్రహ్మాచారి, అధ్యాపకులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Results 2025
- Krishna University
- semester results
- KU UG 6th Semester Results
- 6th semester exam results
- KU Vice Chancellor Ramji
- 98.99 Pass Percentage
- Re evaluation of semester results
- KU Semester Results 2025
- KU Semester Results Re Evaluation
- Education News
- Sakshi Education News
- IndianMilitaryStrength
- DefensePreparedness