Placement Offer for KLU Student : ప్లేస్మెంట్‌లలో మెరిసిన కేఎల్ విద్యార్థులు.. ఏకంగా 75 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం..

సాక్షి ఎడ్యుకేషన్: సాధారణంగా ప్రతీ వర్సిటీలో, కళాశాలల్లో విద్యార్థులకు ప్లేస్మెంట్లు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చి ఉద్యోగావకాశాలను సొంతం చేసుకుంటారు. అయితే, ఒకవేళ ప్లేస్మెంట్‌లో ఉద్యోగం సాధించినా, కొంత మెరు జీతాలు వస్తుంటాయి. తక్కువ మంది విద్యార్థులకు పెద్ద ఎత్తున వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తుంటాయి. అందులో ఒకరే ఈ విద్యార్థి కూడా.. ఇటీవల కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు చాలామంది పాల్గొన్నారు.
75 లక్షల వార్షిక వేతనం..
ప్లేస్మెంట్‌లో విద్యార్థులంతా మంచి ప్యాకేజీలతో కూడిన ఉద్యోగాలను దక్కించుకున్నారు. ఈ మెరకు ఆ వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థులు ఇలాంటి ఉన్నత కంపెనీల నుంచి ఉత్తమ జీతాలతో కూడిన ఆఫర్లను అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు.
AP DSC Preparation Tips: తక్కువ సమయం.. ఎక్కువ సిలబస్.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ ఇలా!
విద్యార్థులంతా వారి ప్రతిభను కనబర్చి ఉన్నతంగా రాణించారంటూ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని కేఎల్ హెచ్ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 75 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేస్‌మెంట్ సాధించారని తెలిపారు. 20 నుంచి 50 లక్షల రూపాయలలోపు వార్షిక ప్యాకేజీతో సూపర్ డ్రీమ్, డ్రీమ్ కంపెనీలలో తమ స్టుడెంట్లు ప్లేస్ అయ్యారని చెప్పారు.
విద్యార్థులు.. జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో ప్లేస్‌మెంట్స్ దక్కించుకున్నారని వివరించారు. అంతేకాకుండా, తమ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కూడా చేస్తున్నారని, కోర్ కంపెనీ ప్లేస్‌మెంట్లలో కూడా తమ విద్యార్థులు ప్రతిభ కనబరచి ఉద్యోగాలు పొందటం విశేషమన్నారు. విద్యార్థులపై తమకెంతో గర్వంగా ఉందన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- KL University
- Students placements
- Job Opportunity
- students talent and skills
- KLU Placements
- Job Interviews
- 75 lakh package offer
- KLU Placements Offer
- 20 to 30 lakhs package offers
- KLU Students
- students skills and talent in placements
- KL University Director Dr. Akella Ramakrishna
- KL University Students
- KL University Placement Packages
- Top packages for students in KLU Placements
- Students success with Placement Package
- KLU Placements for Students
- students talent and opportunity
- KL University Placement Package of 75 Lakh Annual
- Education News
- Sakshi Education News