Skip to main content

Andhra University: ఏయూతో ఐసీటీ అకాడమీ అవగాహన ఒప్పందం

ICT Academy MoU with Andhra University

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఐసీటీ అకాడమీ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత సమక్షంలో ఒప్పంద పత్రాలపై బుధవారం రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, ఐసీటీ అకాడమీ సీఈవో హరి బాలచంద్ర సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఐసీటీ అకాడమీకి నోడల్‌ కేంద్రంగా ఏయూ నిలవనుంది. ఏయూ ఆచార్యులకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో అవసరమైన సేవలను ఐటీసీ అందిస్తుంది. ఈ సేవలను ఏయూతో పాటు అనుబంధ కళాశాలల అధ్యాపకులు పొందే అవకాశం ఉంది. ఏయూ ఆచార్యుల పరిశోధన పత్రాలను ఐసీటీ జర్నల్స్‌లో ప్రచురిస్తారు. ఏయూ అలుమ్ని అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఇ.శంకర రావు, మీడియా రిలేషన్స్‌ డీన్‌ ఆచార్య చల్లా రామకృష్ణ, ఐసీటీ అకాడమీ స్టేట్‌ హెడ్‌ దినకర్‌ రెడ్డి, రీజినల్‌ మేనేజర్‌ బి.ప్రవీణ్‌ కుమార్‌, ఏయూ అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ పాల్గొన్నారు

చదవండి: Andhra University: ఏయూతో కెనడాకు చెందిన ఆరెంజ్‌ న్యూరో సైన్సెస్‌ సంస్థ అవగాహన ఒప్పందం

Published date : 24 Aug 2023 02:51PM

Photo Stories