Indian Red Cross organization: రెడ్‌క్రాస్‌లో విద్యార్థులకు అవకాశం ఇవ్వండి
రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్, జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాలపై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రెడ్‌క్రాస్ చైర్మన్, సభ్యులు, పలు కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం ఏర్పాటుచేశారు. జేసీ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవా దృక్పథం కలిగిన సంస్థ అన్నారు. ఆ సంస్థలో కేవలం పెద్దవారే కాకుండా స్కూళ్లు, కళాశాలల్లోని తొమ్మది నుంచి డిగ్రీ వరకు ఉన్న విద్యార్థులను చేర్చుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 50వేలమందిని చేర్చుకోవాలన్నారు. డిగ్రీ కళాశాలలకు ఇన్‌చార్జిగా డాక్టర్ సుధాకర్, ఫార్మసీ కళాశాలల ఇన్‌చార్జిగా ఎన్‌పీసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.సురేష్ కుమార్, ఇంజినీరింగ్ కళాశాలల ఇన్‌చార్జిగా డాక్టర్ శ్రీనివాస్, పాఠశాలలకు ఇన్‌చార్జిగా ఎం.వెంకటరావు నియమించారు. జిల్లా రెడ్‌క్రాస్ అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్‌మోహన్‌రెడ్డి, మేనేజింగ్ కమిటీ సభ్యులు కేఎంఎన్‌వీ శ్రీనివాస గుప్తా, డాక్టర్ రెహమతుల్లా, సింధూ ఎడ్యుకేషనల్ ఎండీ రామకృష్ణ, శంకరభారతీపురం హెచ్‌ఎం సదానందం వెంకటరెడ్డి, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రతినిధి వెన్నెల పాల్గొన్నారు.
చదవండి: DELED Exam Fee: 30 లోగా డీఈఎల్‌ఈడీ పరీక్ష ఫీజు చెల్లించండి