Good News for Women Employment : మహిళలకు సర్కార్ శుభవార్త.. ఉపాధి కోసం ఉచితంగా.. వీరికే అర్హత..

సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగ మహిళలకు, గృహిణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కల్పనతోపాటు ఆర్థిక చేయూత కూడా అందే విధంగా వినూత్న పథకాలను ప్రవేశ పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం. స్వయం ఉపాధి అనే పథకంలో భాగంగా మహిళలకు కుట్టు మిషిన్‌లను అందజేస్తుంది సర్కార్. అయితే, ఈ వార్తలోని అసలు విషయం ఏంటంటే.. ఈ పథకం అన్ని వర్గాల మహిళలకు వర్థించదు.
ఇది కేవలం తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన అర్హత కలిగిన మహిళలకు మాత్రమే వర్థిస్తుంది. వారు మాత్రమే ఈ ఉచిత కుట్టు మిషిన్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అర్హులైన వారు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు..
ఈ కుట్టుమిషన్లను ఆల్రెడీ కుట్టుపనిలో ట్రైనింగ్ పొందిన ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ మతాలకు చెందిన మహిళలకు మాత్రమే ఇస్తారు. పూర్తి సమాచారం కోసంఈ లింక్ పై క్లిక్ చేయండి.
21 నుండి 55 సంవత్సరాల వయస్సుతోపాటు 5వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
బాప్టిజం, బీసీ సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
OU PhD Admissions: ఓయూ పీహెచ్‌డీ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా.. కారణం ఇదే!
కుట్టుపనిలో ట్రైనింగ్ పొందిన సర్టిఫికెట్ ఉండాలి. టీజీసీఎమ్ఎఫ్‌సీ అనుసంధ సంస్థల నుంచి శిక్షణ పొంది ఉండాలి.
తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉండాలి లేదా ఆదాయ దృవీకరణ పత్రం ఉండాలి. తప్పనిసరిగా నిరుద్యోగులు అయి ఉండాలి.
సంవత్సర ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి.
దరఖాస్తుల విధానం..
మహిళలకు ఉపాధి అవకాశంగా, ఆర్థిక సాయంగా ఉండేందుకు కేటాయిస్తున్న కుట్టుమిషిన్‌లు పొందేందుకు ముందుగా https://tgobmms.cgg.gov.inసైట్ ను సందర్శించాలి.
సైట్ ఓపెన్ అయ్యాక.. Apply Online for availing the Sewing Machines under ” Indiramma Mahila Shakti ” scheme (Christian Minority – 2024-25) పై క్లిక్ చేయాలి.
అక్కడ కనిపిస్తున్న దరఖాస్తుల ఫార్మ్‌ను పూర్తిగా ఫిలప్ చేయాలి. అక్కడ అడిగిన ప్రతీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
TCS BPS Freshers Hiring 2025: టీసీఎస్‌లో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు చేసుకోండి.. అర్హులు మీరే..
మొత్తం వివరాలను నమోదు చేసిన తరువాత ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి. దీంతో, మీరు చేసిన తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, మీరు ఏదైనా వివరాలను నమోదు చేయడం మర్చిపోతే మరో అవకాశం దక్కుతుంది.
ఫార్మ్ సబ్మెట్ చేసిన తరువాత మీకు ఒక ఎక్‌నాలేజ్‌మెంట్ వస్తుంది.
అందులో ఉండే ఐడీ నంబర్‌లో.. మీ ఫారమ్ స్టేటస్‌ని కూడా తర్వాత తెలుసుకోవచ్చు. ఈ ఫారమ్‌లో పేరు, రేషన్ కార్డు నంబర్, తండ్రి పేరు, సంవత్సర ఆదాయం, పెళ్లి వివరాలు, మొబైల్ నంబర్, మతం, టైలరింగ్ ట్రైనింగ్ వివరాలు, ఆధార్ నంబర్, వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే.. అడ్రెస్ వివరాలను నింపి, కింద ఒక ఫొటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేయాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Women employment
- sewing machines
- Telangana Government
- Employment opportunity
- Women Self Employment
- govt good news for women
- good news for women employment
- fifth class passedouts
- job offers for women
- sewing machines for women employment
- free sewing machines for women
- telangana state government announces good news for women
- eligibilities for sewing machine
- online applications
- applications for free sewing machines for women
- telangana govt good news for women employment
- Education News
- Sakshi Education News