Skip to main content

TS Degree Admissions(Dost 2022) : దోస్త్-2022 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల‌లో ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి చైర్మ‌న్ లింబాద్రి జూన్ 29వ తేదీన నోటిఫికేషన్‌ను విడుద‌ల చేశారు.
Dost 2022 Notification
Dost 2022 Notification

రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ మొత్తం 1,080 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 129 ప్ర‌భుత్వ కాలేజీలు ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ మొద‌లైన కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మూడు విడతల్లో ఈ డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ సారి కూడా ఆన్‌లైన్ విధానంలోనే ద్వారా డిగ్రీ ప్ర‌వేశాల‌ను చేప‌ట్ట‌నున్నారు.

మొద‌టి విడుత ముఖ్యమైన తేదీలు ఇవే..

Dost 2022


మొద‌టి విడుత దోస్త్ రిజిస్ట్రేష‌న్ల ప్రారంభ తేదీ : జూలై 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు
వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు తేదీ: జులై 6 నుంచి 30 వ‌ర‌కు
సీట్ల‌ను కేటాయింపు తేదీలు : ఆగ‌స్టు 6న
సెల్ఫ్ రిపోర్టింగ్ : ఆగ‌స్టు 7 నుంచి 18 వ‌ర‌కు

రెండో విడుత ముఖ్యమైన తేదీలు ఇవే..
రెండో విడుత రిజిస్ట్రేష‌న్ల ప్రారంభ తేదీ : ఆగ‌స్టు 7 నుంచి 21వ తేదీ వ‌ర‌కు
వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు తేదీ: ఆగ‌స్టు 7 నుంచి 22 వ‌ర‌కు
రెండో విడుత సీట్ల‌ను కేటాయింపు తేదీలు : ఆగ‌స్టు 22న సాయంత్రం

మూడో విడుత ముఖ్యమైన తేదీలు ఇవే..
మూడో విడుత రిజిస్ట్రేష‌న్ల ప్రారంభ తేదీ : ఆగ‌స్టు 29 నుంచి సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు
వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు తేదీ: ఇదే స‌మ‌యంలో వెబ్ ఆప్ష‌న్ల న‌మోదుకు అవ‌కాశం
మూడో విడుత సీట్ల‌ను కేటాయింపు తేదీలు : సెప్టెంబ‌ర్ 16, 2022
 
త‌ర‌గ‌తులు ప్రారంభ తేదీ : అక్టోబ‌ర్ 1 నుంచి

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు విధానం :

Dost online apply


☛ డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్(Dost 2022) అధికారిక వెబ్‌సైట్‌ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి. 
☛ ఇందులో Candidate Pre-Registrationతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
☛తరువాత... Application Fee Paymentతో తగిన ఫీజును చెల్లించాలి. 
☛ ఆ తర్వాత Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

Published date : 29 Jun 2022 06:43PM

Photo Stories