College Holidays : నేడు ఇంటర్ కాలేజీల బంద్.. కారణం ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ నశించాలని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీ వీపీ) డిమాండ్ చేసింది.
ఇంటర్ విద్యను కార్పొరేట్ కబంధ హస్తాల్లో బంధించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నేడు (ఆగస్టు 23వ తేదీ) ఇంటర్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అధిక ఫీజుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కార్పొరేట్ కాలేజీల ఆగడాలను నిరసిస్తూ.. ఆగస్టు 22వ తేదీన (సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఇంటర్ బోర్డు మార్గదర్శకాలను విస్మరిస్తూ అక్రమంగా సంస్థలు నిర్వహిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Published date : 23 Aug 2022 06:45PM