Skip to main content

Upcoming Working Days : రానున్న కాలంలో వారానికి రెండు మూడు రోజులే - బిల్‌ గేట్స్‌

విపరీతమైన పని గంటలు, వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది.
Bill gates predicts upcoming working days would be 2 or 3 days a week

సాక్షి ఎడ్యుకేష‌న్‌: విపరీతమైన పని గంటలు, వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న ఆందోళనలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు.

వారానికి ఐదు లేదా ఆరు రోజులు పని, 9 నుంచి 5గంట‌ల వ‌ర‌కు జాబ్‌.. ఈ సంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పుననిర్నిర్మించగలదని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పని వారాన్ని కేవలం రెండు రోజులకు తగ్గించగలదని బిల్ గేట్స్ చెప్పారు.

బిల్ గేట్స్ బోల్డ్ జోస్యం

జిమ్మీ ఫాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్, ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు.

IIM Kozhikode : బీఎంఎస్‌ ఆనర్స్ విత్ రీసెర్చ్‌ను ప్రారంభించిన ఐఐఎం కోజికోడ్

తత్ఫలితంగా, సాంప్రదాయ ఐదు రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదని గేట్స్ పేర్కొన్నారు.

పని గంటల్లో ఊహించని మార్పు

వారానికి  ఐదు రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుందని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ (ఏఐ) సహాయం చేయడమే కాదు.. మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్వచించగలదని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో రెండు లేదా మూడు రోజులే పనిచేసే రోజులొస్తాయంటున్నారు.

RGUKT B. Tech Admissions 2025 : 6 సంవ‌త్స‌రాల బీటెక్‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఆర్‌జీయూకేటీ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫీషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స​ (ఏజీఐ) సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Apr 2025 03:49PM

Photo Stories