Skip to main content

Awareness Program : గేట్ పరీక్ష స‌న్న‌ద్దంపై విద్యార్థులకు అవ‌గాహ‌న స‌ద‌స్సు

గేట్‌ పరీక్షలో సక్సెస్‌ సాధించాలంటే ముందుగా విద్యార్థులు సిలబస్‌ గురించి తెలుసుకోవాలని గేట్‌ డైరెక్టర్‌ పీఆర్వో వీఎస్‌ఆర్‌ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు.
Awareness program for students in preparing gate exam

నూజివీడు: గేట్‌ పరీక్షలో సక్సెస్‌ సాధించాలంటే ముందుగా విద్యార్థులు సిలబస్‌ గురించి తెలుసుకోవాలని గేట్‌ డైరెక్టర్‌ పీఆర్వో వీఎస్‌ఆర్‌ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక ట్రిపుల్‌ఐటీలో నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లకు చెందిన ఈసీఈ, ఈఈఈ బ్రాంచిలకు చెందిన విద్యార్థులకు బుధవారం గేట్‌ పరీక్షకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా సరళిని తెలుసుకోవాలని, దీని వల్ల ప్రిపరేషన్‌ ఎలా అవ్వాలనే దానికి ప్రణాళిక రూపొందించుకోవచ్చన్నారు.

CAT 2024 Preparation : నవంబర్‌ 24న క్యాట్‌–2024 ఎంట్రన్స్‌.. రివిజన్, ప్రాక్టీస్‌లో ఈ ప్ర‌ణాళిక‌

ప్రిపరేషన్‌ను సాధ్యమైనంత ముందుగానే ప్రారంభించాలని, ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం నుంచే గేట్‌ పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు. ఈ పరీక్షలో విజయం సాధించడానికి ప్రామాణిక పుస్తకాలు ఏవో తెలుసుకొని సరైన పుస్తకాలను ఎంచుకోవడం ద్వారా సులభంగా సక్సెస్‌ సాధించవచ్చన్నారు. గేట్‌ పరీక్షకు సంబంధించిన మునుపటి పేపర్లను, మాక్‌ టెస్ట్‌లను ప్రాక్టీస్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో డీన్‌ అకడమిక్స్‌ కోఆర్డినేటర్‌ పీ చిన్నారావు, డీప్యూటీ ఏఓ ఎస్‌ సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Oct 2024 03:05PM

Photo Stories