Andhra University: ఎం.ఎస్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం, ఎం.ఎస్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం మిస్సోరీ స్టేట్ యూనివర్సిటీతో నిర్వహిస్తున్న ఎం.ఎస్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం, స్కాంటన్ యూనివర్సిటీతో నిర్వహిస్తున్న ఎం.ఎస్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ తెలిపారు. ఇతర వివరాలు ఏయూ వెబ్‌సైట్ నుంచి, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు. ఏయూ సైన్స్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ కార్యాలయం మొదటి అంతస్తులోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Published date : 18 Jul 2023 07:51PM