AP Schools & Colleges : స్కూల్స్, కాలేజీలకు ఆ రోజు పనిదినమే.. కానీ..
ఆగస్టు 13, 14 తేదీల్లో..
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న పెద్ద ఎత్తున సంబరాన్ని నిర్వహించడానికి ఆజాదీ కా అమృతోత్సవాల పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి హర్ ఘర్ జెండా కార్యక్రమం చేపట్టారు. పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఆగస్టు 13, 14 తేదీలు రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలుగా ఉండడంతో సన్నాహక కార్యక్రమాలకు ఆటంకంగా మారింది.
School Holidays : నాలుగు రోజులు పాటు స్కూల్స్‌కు సెలవులు.. ఎందుకంటే..?
జూనియర్ కాలేజీలకు మాత్రం..
విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిహార్సల్స్ వంటివి చేయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో శనివారం సెలవు దినాన్ని పనిదినంగా కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్లు ఎస్.సురేష్‌కుమార్, ఎం.వి.శేషగిరిబాబు సర్క్యులర్లు విడుదల చేశారు. జూనియర్ కాలేజీలకు రెండో శనివారానికి బదులు మూడో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్.. రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు సూచించారు.